మీలో ఇవి కనిపిస్తున్నాయా? అయితే మీ మూత్రపిండాలు దెబ్బతిన్నట్టే..
మూత్రపిండాలు దెబ్బతింటే మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. మీ మూత్రపిండాలు దెబ్బతింటే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

kidney health
మీకు డయాబెటిస్, అధిక రక్తపోటు, మూత్రపిండాల వైఫల్యం కుటుంబ చరిత్ర ఉన్నా లేదా మీకు 60 ఏండ్లు పైబడిన వారికి మూత్రపిండాల వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి వారు ప్రతి సంవత్సరం మూత్రపిండాల వ్యాధి పరీక్ష తప్పకుండా చేయించుకోవాలి. మీకు మూత్రపిండాల వ్యాధి ఉంటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
చర్మం పొడి బారడం
మూత్రిపిండాలు ఆరోగ్యంగా ఉంటే మన ఆరోగ్యం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటుంది. వీటి పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది. ఇవి ఎర్ర రక్త కణాలను తయారు చేయడానికి, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి, మన శరీరం నుంచి వ్యర్థాలు, అదనపు ద్రవాన్ని తొలగించడానికి సహాయపడతాయి. అలాగే మన రక్తంలో ఖనిజాలను సరైన మొత్తంలో ఉంచుతాయి. అలాగే ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా సహాయపడతాయి. మూత్రపిండాలు మన రక్తంలో ఖనిజాలు, పోషకాల సరైన సమతుల్యతను నిర్వహించలేనప్పుడు అంటే మీకు తీవ్రమైన మూత్రిపిండాల వ్యాధి వచ్చినప్పుడు ఖనిజ, ఎముక ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే మీ చర్మం పొడిబారుతుంది. చర్మం దురద పెడుతుంది కూడా.
మూత్ర విసర్జన
ముఖ్యంగా రాత్రిపూట మాటిమాటికి మూత్ర విసర్జన చేయాలనిపిస్తే మీకు మూత్రపిండాల వ్యాధి ఉన్నట్టే. మూత్రపిండాల ఫిల్టర్లు దెబ్బతినడం వల్ల మీకు మాటిమాటికి మూత్ర విసర్జన చేయాలనే కోరిక పెరుగుతుంది. ఇది అప్పుడప్పుడు పురుషులలో మూత్ర సంక్రమణ లేదా విస్తరించిన ప్రోస్టేట్ ను కూడా సూచిస్తుంది.
puffy eyes
కళ్ల చుట్టూ ఉబ్బు
మూత్రపిండాల ఫిల్టర్లు సరిగ్గా పనిచేయకపోవడం, మూత్రంలోకి ప్రోటీన్ అలాగే ఉండటం మూత్రపిండాల వ్యాధికి సంకేతం. మీ మూత్రపిండాలు దానిని నిల్వ చేయడానికి బదులుగా మూత్రంలోకి చాలా ప్రోటీన్ ను విడుదల చేస్తాయి. అందుకే మీకు మీ కళ్ళ చుట్టూ వాపు ఉంటుంది.
swollen feet
చీలమండలు, పాదాలు వాపు
మూత్రపిండాల పనితీరు దెబ్బతినడం వల్ల శరీరంలో ఉప్పు, నీరు నిల్వ ఉంటాయి. దీనివల్ల మీ పాదాలు, చీలమండలు ఉబ్బుతాయి. అంతేకాదు దిగువ అవయవాలలో వాపు గుండె జబ్బులు, కాలేయ వ్యాధి వంటి సమస్యలకు కారణమవుతుంది.
ఆకలి లేకపోవడం
ఎన్ని గంటలైనా ఆకలి లేకపోవడాన్ని లైట్ తీసుకోకూడదు. ఎందుకంటే ఇది మూత్రపిండాల వ్యాధికి సంకేతం కాబట్టి. బలహీనమైన మూత్రపిండాల పనితీరు వల్ల వచ్చే టాక్సిన్స్ ఏర్పడటం వల్ల ఆకలి వేయదని నిపుణులు చెబుతున్నారు.