ఇయర్ ఫోన్స్ ను ఎక్కువగా వాడారో ఈ సమస్యలొస్తయ్ జాగ్రత్త..
ఈ మధ్యకాలంలో ఇయర్ ఫోన్స్ వాడకం బాగా పెరిగింది. పిల్లలు, పెద్దలు అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. కానీ వీటిని ఎక్కువ సేపు వాడటం వల్ల ఎన్నోఅనారోగ్య సమస్యలు వస్తాయి.
Image: Getty
చేతిలో ఫోన్, చెవిలో ఇయర్స్ పెట్టుకున్న వారు ఎక్కడ చూసినా కనిపిస్తారు. ఇది కూడా ఒక ఫ్యాషన్ లా మారిపోయింది. బైక్, స్కూటీ నడుపుతున్నప్పుడు, గేమ్స్ ఆడుతున్నప్పుడు, మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు, ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు, వర్కవుట్ చేస్తున్నప్పుడు ఇలా చాలా మంది చెవుల్లో ఇయర్ఫోన్లు కనిపిస్తాయి. రాత్రిపూట సినిమా చూస్తున్నప్పుడు ఇన్ స్టాగ్రామ్ స్క్రోల్ చేసేటప్పుడు చెవుల్లో ఎన్ని గంటలు ఇయర్ ఫోన్స్ ఉంటాయో తెలియదు. ఇదంతా బాగానే అనిపిస్తుండొచ్చు. కానీ ఇలా ఇయర్ ఫోన్స్ ను ఎక్కువగా వాడటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటంటే?
Image: Getty
మైకంగా అనిపించడం
అవును ఇయర్ ఫోన్స్ ను ఎక్కువ సేపు ఉపయోగించడం వల్ల మైకంగా అనిపిస్తుంది. ఫోన్ లో మాట్లాడేటప్పుడు, మ్యూజిక్ వింటున్నప్పుడు చాలా సేపు చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ ఇలా ఎక్కువ సేపు ఇయర్ ఫోన్స్ ను చెవుల్లో పెట్టడం వల్ల చెవి సమస్యలు వస్తాయి. ఎక్కువ వాల్యూమ్ తో పాటలను విన్నప్పుడు చెవిలో ఒత్తిడి పెరుగుతుంది. దీంతో మీకు మైకంగా అనిపిస్తుంది.
Image: Getty
చెవి ఇన్ఫెక్షన్
చెవుల్లో ఇయర్ ఫోన్స్ ను పెట్టినప్పుడు చెవి లోపలికి గాలి వెళ్లదు. ఇయర్ ఫోన్స్ ను దీర్ఘకాలికంగా వాడటం వల్ల చెవుల్లో బ్యాక్టీరియా పెరుగుతుంది. ఒకే ఇయర్ ఫోన్ ను చాలా మంది ఉపయోగిస్తుంటారు. ఇది సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే ఇతరుల ఇయర్ఫోన్లను ఉపయోగించడం మానుకోండి. ఇది మీ చెవులకు బ్యాక్టీరియాను బదిలీ చేస్తుంది. ఇది ఇద్దరినీ ప్రమాదంలో పడేస్తుంది.
Image: Getty
చెవుల్లో నొప్పి
చెవులకు సరిగ్గా సరిపోని ఇయర్ ఫోన్స్ ను వాడటం వల్ల చెవులు నొప్పి కలుగుతాయి. అలాగే చెవులకు సరిపడని ఇయర్ఫోన్లను దీర్ఘకాలికంగా ఉపయోగించడం వల్ల చెవుల లోపలి భాగంలో విపరీతమైన నొప్పి కలుగుతుంది.
Image: Getty
వినికిడి సమస్యలు
ఎక్కువ సౌండ్ తో ఇయర్ ఫోన్స్ లో పాటుల వినడం వల్ల చెవుల్లో కంపనం ఏర్పడుతుంది. ఇది మన జుట్టు కణాలను ప్రభావితం చేస్తుంది. ఇయర్ ఫోన్స్ ను ఎక్కువ సేపు చెవుల్లో పెట్టుకోవడం వల్ల మీ సమస్యను మరింత పెరుగుతుంది. దీంతో చెవిటితనం కూడా రావొచ్చు.