ఆరోగ్యానికి మంచివని చియా విత్తనాలను ఎక్కువగా తిన్నారో..!
చియా గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి బరువు తగ్గేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి. అయితే ఈ విత్తనాలను మరీ ఎక్కువగా తిన్నారో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చియా విత్తనాలు సాల్వియా హిస్పానికా మొక్క విత్తనాలు. ఈ మొక్క పుదీనా కుటుంబానికి చెందింది. చియా విత్తనాలను బరువు తగ్గేందుకు చాలా మంది ఉపయోగిస్తుంటారు. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే చియా విత్తనాలు వాటర్ లేదా పాలలో నానబెడతారు. దీంతో ఈ విత్తనాలు పెద్దగా అవుతాయి. చియా విత్తనాలతో బోలెడు లాభాలున్నప్పటికీ.. వీటిని మోతాదుకు మించి తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
chia seeds
జీర్ణక్రియ సమస్య
చియా విత్తనాలు జీర్ణక్రియకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. చియా విత్తనాల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అయితే ఈ విత్తనాలను ఎక్కువగా తీసుకుంటే మీ శరీరం వీటిని సరిగ్గా జీర్ణించుకోవడం కష్టమవుతుంది. రోజుకు కొన్ని చియా విత్తనాలను మాత్రమే తీసుకోవాలి. మరీ ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ చిన్న విత్తనాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల విరేచనాలు, ఉబ్బరం, కడుపు తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి.
రక్తపోటు మందులకు ఆటంకం కలిగిస్తుంది
చియా విత్తనాలు రక్తం పల్చబడటానికి కారణమవుతాయి. చియా విత్తనాలలో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు రక్తాన్ని పల్చబరిచే లక్షణాలను కలిగి ఉంటాయి. చియా విత్తనాలను ఎక్కువ మొత్తంలో క్రమం తప్పకుండా తీసుకోవడం అధిక రక్తపోటు మందులకు ఆటంకం కలుగుతుంది. మీరు బీపీ మందులు తీసుకుంటుంటే డాక్టర్ ను సంప్రదించిన తర్వాతే చియా విత్తనాలను తక్కువ మోతాదులో తీసుకోండి.
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించగలదు
చియా విత్తనాలు ఫైబర్లకు మంచి వనరులు. కానీ వీటిని ఎక్కువగా తీసుకుంటే ఇవి చక్కెరను గ్రహించే గట్ సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తాయి. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. చియా విత్తనాల్లో ఉండే ఈ లక్షణం ఇప్పటికే మందులు, ఇన్సులిన్ తీసుకుంటున్న డయాబెటిస్ ఉన్నవారికి సమస్య కావొచ్చు. చియా విత్తనాలను ఎక్కువగా తినడం వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీనిని తగ్గించుకోవడానికి మందులు, ఇన్సులిన్ లో మార్పు అవసరం.
రోజుకు ఎన్ని చియా విత్తనాలను తినాలి?
ఆరోగ్య నివేదికల ప్రకారం.. రోజుకు 1 నుంచి 1.5 టేబుల్ స్పూన్ చియా విత్తనాలు మన శరీరానికి సరిపోతాయి. ఈ విత్తనాల నుంచి పోషకాలు పుష్కలంగా అందుతాయి. చియా విత్తనాలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లం, ఫైబర్స్, ప్రోటీన్, కాల్షియం, భాస్వరం, జింక్ లు ఉంటాయి.
చియా విత్తనాలను ఎలా తినాలి?
ఈ చియా విత్తనాలను నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపునే తాగొచ్చు.