చక్కెర తినడం వల్ల డయాబెటిస్ వస్తుందా... నిపుణులు ఏమంటున్నారంటే?
ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది బాధపడుతున్న అనారోగ్య సమస్యలలో డయాబెటిస్ ఒకటి. ప్రతి పదిమందిలో ఏడు మంది ఈ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే చాలామంది చక్కెరను అధికంగా తినడం వల్ల డయాబెటిస్ వస్తుందని భావిస్తుంటారు. మరి నిజంగానే చక్కెర తినడం వల్ల డయాబెటిస్ వస్తుందా? డయాబెటిస్ రావడానికి గల కారణాలు ఏమిటి?ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారు అనే విషయానికి వస్తే...

ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల కానుగుణంగా ఎంతో మంది ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ప్రతి పది మందిలో ఏడు మంది బాధపడుతున్న సమస్యలలో డయాబెటిస్ సమస్య ఒకటి.అయితే చాలామంది చక్కెరలను తినడం వల్ల డయాబెటిస్ అధికమవుతుందని అపోహ పడుతుంటారు అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని నిపుణులు ఈ అపోహలపై క్లారిటీ ఇచ్చారు.
నిజానికి మన శరీరంలో సరైన మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవటం వల్ల డయాబెటిస్ వస్తుంది. ఈ ఇన్సులిన్ అధిక మోతాదులో ఉత్పత్తి అయి మన శరీరంలో చక్కర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ అధిక మోతాదులో ఉత్పత్తి కాదో ఆ సమయంలో చక్కెర స్థాయిలను నియంత్రణ కోల్పోవడంతో మనకు డయాబెటిస్ పెరుగుతుంది.అయితే కేవలం చక్కరలను తినడం వల్ల డయాబెటిస్ వస్తుంది అనడం పూర్తిగా అపోహ అంటూ నిపుణులు తెలిపారు.
ఇకపోతే కొందరి శరీరంలో ఇన్సులిన్ హెచ్చుతగ్గుల కారణంగా డయాబెటిస్ రాగా మరికొందరిలో అధిక శరీర బరువు, వంశపారంపర్యంగా కూడా ఈ డయాబెటిస్ వ్యాప్తి చెందుతుంది. ఇలా డయాబెటిస్ తో బాధపడేవారు దీర్ఘకాలిక మందులను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇలా మందులను ఉపయోగిస్తూ కొన్ని ఆహార నియమాలను శారీరక వ్యాయామాలు చేయడం వల్ల డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుకోవచ్చు.
ఇకపోతే కొంతమంది మహిళలలో ప్రెగ్నెన్సీ సమయంలో డయాబెటిస్ వ్యాప్తి చెందుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్ల అసంతల్యత కారణంగా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడంతో ఇలా డయాబెటిస్ వస్తుంది. దీనిని జస్టినేషనల్ డయాబెటిస్అని కూడా పిలుస్తారు. అయితే గర్భధారణ సమయంలో డయాబెటిస్ బారిన పడితే బిడ్డకు కూడా వస్తుందని కాదు డాక్టర్ సూచించిన విధంగా మందులు ఉపయోగించడం మంచిది.అయితే మన రక్తంలో ఇన్సులిన్ శాతం అధికంగా ఉండటం వల్ల బిడ్డలో కూడా ఇన్సులిన్ స్థాయి హెచ్చుతగ్గులుగా ఉన్నప్పుడు బిడ్డ అధిక శరీర బరువుతో పుట్టడం, టైప్ 2 డయాబెటిస్ శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.