సెనగపప్పు రవ్వ పాయసం.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!
సెనగపప్పు, రవ్వతో చేసుకునే పాయసం చాలా రుచిగా ఉంటుంది. ఈ పాయసాన్ని పండుగ సమయంలో ఎక్కువగా చేస్తుంటారు.

ఈ పాయసం తయారీలో చక్కెరకు బదులు బెల్లాన్ని ఉపయోగిస్తారు. కనుక ఆరోగ్యానికి ఎంతో మంచిది (Very good for health). ఈ పాయసం తయారీ విధానం కూడా సులభం. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం సెనగపప్పు రవ్వ పాయసం (Senagapappu Rava Payasam) తయారీ విధానం గురించి తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు: ఒక కప్పు సెనగపప్పు (Senagapappu), సగం కప్పు రవ్వ (Ravva) అర లీటర్ పాలు (Milk), రెండు టేబుల్ స్పూన్ ల పచ్చి కొబ్బరి తురుము (Grate raw coconut), కప్పు నెయ్యి (Ghee), ఒకటిన్నర కప్పు బెల్లం (Jaggery) తరుగు, చిటికెడు యాలకుల పొడి (Cardamom powder), పది బాదం (Almond), పది జీడిపప్పు పలుకులు (Cashew nuts), కొన్ని ఎండుద్రాక్షలు (Raisins).
తయారీ విధానం: ముందుగా సెనగపప్పును రెండుసార్లు నీటిలో కడిగి గంటపాటు నానబెట్టుకోవాలి (Soak). ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో నానబెట్టుకున్న సెనగపప్పు, రెండు గ్లాసుల నీళ్లు, ఒక స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టి తక్కువ మంట (Low flame) మీద ఐదు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి. సెనగపప్పు మరి మెత్తగా ఉడికించకుండా కాస్త పలుకులుగా ఉండేలా చూసుకోవాలి.
సెనగపప్పు పూర్ణంలా కాకుండా కాస్త పలుకులుగా ఉంటే పాయసం చాలా రుచిగా (Tastefully) ఉంటుంది. ఇప్పుడు మరో స్టవ్ మీద కడాయి పెట్టి అందులో రవ్వ వేసి తక్కువ మంట మీద ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ఐదు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ఆవిరి తగ్గిన తరువాత మూత తీసి అందులో ఒక గ్లాసు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి మరోసారి బాగా ఉడికించుకోవాలి (Cook well).
సెనగపప్పు బాగా ఉడుకుతున్న సమయంలో వేయించుకున్న రవ్వను వేసి ఉండలు కట్టకుండా (Without lumps) బాగా కలుపుకొని (Mix well) ఉడికించుకోవాలి. రవ్వ ఉడికే సమయంలో పాలు పోసి కలుపుకొని మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకుని బెల్లం తరుగు వేసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగి బాగా ఉడుకుతున్నప్పుడు చిటికెడు యాలకుల పొడి, పచ్చి కొబ్బరి తురుము వేయాలి. యాలకుల పొడి పాయసానికి మంచి సువాసనను అందిస్తుంది.
ఇప్పుడు మరో స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి కరిగిన తరువాత జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష వేసి మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై (Fry) చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ (Dry fruits) ను పాయసంలో వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన హెల్తీ సెనగపప్పు రవ్వ పాయసం రెడీ. ఇంకెందుకు ఆలస్యం ఈ పాయసాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.