Health Tips: వర్షాకాలంలో ఏవి పడితే అవి తినకండి.. కాస్త ఈ డైట్ ప్లాన్ ఫాలో అవ్వండి?
Health Tips: వేసవికాలంలో ఏమి తిన్నా అరిగిపోతుంది. అదే వర్షాకాలం వచ్చేటప్పటికి ఏది పడితే అది తినలేం. ఎందుకంటే ఈ సీజన్లో ఫుడ్ ఎక్కువగా అరగదు పైగా ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ డైట్ చార్ట్ మీకోసం.

వర్షాలు ఆహ్లాదకరమైన వాతావరణాన్నే కాదు అనారోగ్య సమస్యలను కూడా వెంటపెట్టుకొని వస్తుంది. అది జలుబు, ఇన్ఫెక్షన్, వైరల్ ఫీవర్ మొదలైనవి. అందుకే ఇలాంటి సీజన్లో ఎలాంటి ఆహారం పడితే అలాంటి ఆహారం తీసుకోకుండా పరిస్థితులకి అనుగుణంగా మీ ఫుడ్ చార్ట్ ని మార్చుకోండి.
వర్షాకాలంలో వీలైనంత మటుకు బయట తినటం తగ్గించండి. అలాగే ఆకుకూరలు కూడా వీలైనంతవరకు తగ్గించండి ఎందుకంటే ఆకుకూరల ద్వారా బ్యాక్టీరియా మన కడుపులో చేరి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది.
తప్పనిసరి పరిస్థితులలో ఆకుకూరలు తినవలసి వస్తే వాటిని చాలా జాగ్రత్తలు తీసుకొని శుభ్రం చేసి ఆపై వంటకి వినియోగించండి. అలాగే వర్షాకాలంలో చేపలు, రొయ్యలు తినడం కాస్త తగ్గించండి ఎందుకంటే ఇది వాటి సంతాన ఉత్పత్తి కాలం.
ఈ సమయంలో వాటిని తింటే మీరు ఇన్ఫెక్షన్ కి గురవుతారు. వర్షాకాలంలో ఎక్కువగా వేడి వేడి ఆహారాన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినటానికి ఇష్టపడండి. అలాగే పప్పు, సోయాబీన్స్ వంటి ప్రొటీన్ రిచ్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయండి.
తరచుగా పసుపు కలిపిన పాలు తాగుతూ ఉండడం వలన మీరు త్వరగా ఇన్ఫెక్షన్ కి గురికారు. అలాగే గుడ్లు, మాంసం తినటం వల్ల ప్రోటీన్లు ఎక్కువగా లభిస్తాయి మరియు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి కాబట్టి వీటిని తరచుగా తీసుకోవడానికి ప్రయత్నించండి.
అలాగే తాజా పండ్లు, తాజా కూరగాయలు అంటే బ్రోకోలి, నిమ్మకాయ, క్యాబేజీ, నారింజ, బచ్చల కూర వంటి కూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహకరిస్తాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ వర్షాకాలాన్ని ఎంజాయ్ చేయండి.