- Home
- Life
- Health
- డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారా.. అన్నం ఇలా చేసుకుంటే చాలు ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు!
డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారా.. అన్నం ఇలా చేసుకుంటే చాలు ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు!
ప్రస్తుత కాలంలో ఎక్కువమంది బాధపడుతున్నటువంటి అనారోగ్య సమస్యలలో డయాబెటిస్ ఒకటి. ప్రతి పది మందిలో ఏడు మంది ఈ విధమైనటువంటి సమస్యతో బాధపడుతున్నారు.అయితే డయాబెటిస్ వంటి వ్యాధులకు గురైన వారు దీర్ఘకాలికంగా మందులను వాడుతూ ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుంది. అయితే మనం తినే అన్నం సరైన పద్ధతిలో వండటం వల్ల కూడా ఈ వ్యాధికి చెక్ పెట్టవచ్చు. మరి అన్నం ఎలా వండుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం...

డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు అన్నం ఎక్కువగా తినటం వల్ల వారి శరీరంలో చక్కర స్థాయిలో మరింత అధికమవుతాయని చాలామంది అన్నం తినకుండా ఉంటారు.అయితే మనం సరైన పద్ధతిలో అండం వండుకోవటం వల్ల ఈ చక్కెర వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చు అని నిపుణులు వెల్లడిస్తున్నారు యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్ పరిశోధనల ప్రకారం అన్నం PBA పద్ధతి ద్వారా వండుకోవాలని తెలిపారు. అంటే శోషణ పద్ధతితో పార్బాయిలింగ్.
పార్బాయిలింగ్ అంటే మనం వెచ్చని నీటి ఆవిరితో వరి బియ్యాన్ని సగం వరకు ఉడికించి దాని నాణ్యతను మరింత మెరుగుపరిచే పద్ధతిని పార్బాయిలింగ్ అంటారు. ఇలాంటి బియ్యాన్ని ఎక్కువగా రెస్టారెంట్లలో ఉపయోగిస్తుంటారు. ఈ బియ్యం దాదాపు 70% మాత్రమే ఉడకబెడతారు. ఉదాహరణకు మనం బిర్యానీ తయారు చేసేటప్పుడు ఉపయోగించే ఆ బియ్యాన్ని పార్బాయిలింగ్ పద్ధతిలోనే 70% ఉడికించి తయారు చేసుకుంటాము.
డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు అన్నం వండుకునే పద్ధతి విషయానికి వస్తే ముందుగా మనం అన్నం తయారు చేసుకోవడానికి ఐదు నిమిషాల ముందు బియ్యం బాగా కడిగి ఆ నీటిని వంపేయాలి అలాగే మరికొన్ని నీళ్లను వేసి ఐదు నిమిషాల తర్వాత తక్కువ మంటపై అన్నం మెత్తగా ఉడికించి ఉడికిన తర్వాత ఆ నీటిని మొత్తం వంపేయాలి.అలాగే తక్కువ మంటపై మరో మూడు నిమిషాలు పాటు పెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇలా అన్నం మొత్తం ఉడికిన తర్వాత అందులో ఉన్నటువంటి పిండి పదార్థాలు, 75 శాతం ఆర్సెనిక్ తొలగిపోతుంది. ఇలా అన్నం వండేటప్పుడు ఉడికిన తర్వాత ఉంచడం వల్ల అందులో ఉన్నటువంటి పదార్థాలు బయటకు వెళ్ళటం వల్ల డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు తరచూ అన్నం తీసుకున్న వారి శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు నిలకడగానే ఉంటాయి. అయితే ఇప్పటికి చాలామంది ఈ పద్ధతిలోనే అన్నం వండుకుంటున్నారు. అయితే ఈ పద్ధతిలో చేయడం వల్ల డయాబెటి సమస్యతో బాధపడే వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.