MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • Home
  • Life
  • Health
  • ఈ చలికాలంలో రోజూ టీస్పూన్ నెయ్యిని తినండి.. మీకున్న సమస్యలన్నీ తగ్గిపోతయ్

ఈ చలికాలంలో రోజూ టీస్పూన్ నెయ్యిని తినండి.. మీకున్న సమస్యలన్నీ తగ్గిపోతయ్

నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే దీన్ని పచ్చల్లతో పాటుగా ఎన్నో వంటకాలతో కలిపి తింటూ ఉంటారు. నిజానికి నెయ్యిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగున్నాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. చలికాలంలో రోజూ ఒక టీస్పూన్ నెయ్యిని తింటే ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. 

Shivaleela Rajamoni | Updated : Dec 07 2023, 07:15 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
ghee

ghee

చలికాలంలో మన ఆరోగ్యం ఎంతో ప్రభావితం అవుతుంది. ఇతర కాలాలతో పోలిస్తే ఈ కాలంలోనే ఎన్నో అనారోగ్య సమస్యలు సోకుతుంటాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆస్తమా, గ్యాస్, అజీర్ణం వంటి ఎన్నో రకాల సమస్యలు చలికాలంలోనే ఎక్కువగా వస్తుంటాయి. ఇక వీటిని తగ్గించుకునేందుకు చాలా మంది ఈ సీజన్ లో యాంటీ బయాటిక్స్ ను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కానీ ఇవి మన శరీరానికి అంత మంచివి కాదు. అయితే ఈ యాంటీబయాటిక్స్ తీసుకున్న తర్వాత నీళ్లను ఎక్కువగా తాగాలి. కానీ ముందే చలికాలం. ఈ సీజన్ లో నీళ్లను పుష్కలంగా తాగే వారు చాలా తక్కువ. అందుకే వీటిని ఉపయోగించకూడదని నిపుణులు చెప్తారు. 

25
Asianet Image

అయితే మన దైనందిన జీవితంలో కొన్ని మార్పులు చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. అలాగే అనారోగ్య సమస్యలను తొందరగా తగ్గించుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండేందుకు నెయ్యి ఎంతగానో సహాయపడుతుంది. అందుకే నెయ్యిని ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తూ వస్తున్నారు. ఆయుర్వేదంలో కూడా నెయ్యి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. వేడివేడి అన్నంలో నెయ్యిని వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ప్రతిరోజూ నెయ్యిని తింటే శరీరానికి ఎంతో మంచిది. అయితే దుకాణాల్లో దొరికే నెయ్యిని కల్తీ చేస్తున్నారు. కాబట్టి ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకుని తినడం మంచిది.
 

35
Helps Brain Function

Helps Brain Function

మనలో చాలా మంది నెయ్యిని తింటే బరువు పెరుగుతామని అనుకుంటారు. అందుకే దీన్ని పక్కన పెట్టేస్తుంటారు. నిజానికి నెయ్యి మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నెయ్యిలో ఉండే హెల్తీ ఫ్యాట్స్ మన కడుపును తొందరగా నింపుతాయి. ఫలితంగా మీరు అతిగా తినలేరు. దీంతో మీ బరువు కూడా అదుపులో ఉంటుంది.

45
Benefits of Ghee

Benefits of Ghee

నెయ్యి జీర్ణం కావడం కష్టమని చాలా మంది అంటూ ఉంటారు. అందుకే నెయ్యితో చేసిన ఆహారాలను పక్కన పెట్టేస్తుంటారు. అయితేు ప్రతిరోజూ ఒక చెంచా నెయ్యిని తింటే జీర్ణవ్యవస్థకు మంచిదని నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకం ఉన్నవారు రోజూ నెయ్యిని తింటే  కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యల నుంచి బయటపడతారు. మలబద్దకం సమస్య ఉండనే ఉండదు. 
 

55
Benefits of Ghee

Benefits of Ghee

నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీర శక్తిని పెంచుతుంది. అలాగే మన రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఎముకలు లేదా కీళ్ల నొప్పులకు కూడా నెయ్యి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

Shivaleela Rajamoni
About the Author
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు. Read More...
 
Recommended Stories
Top Stories