MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • రోజూ బాదం పప్పులను ఎందుకు తినాలంటే?

రోజూ బాదం పప్పులను ఎందుకు తినాలంటే?

చూడటానికి చిన్నగా కనిపించినా కొన్ని ఆహార పదార్థాల్లో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి వాటిలో బాదం పప్పులు ఒకటి. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 20 2023, 11:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాదంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఇవి పోషకాల పవర్ హౌస్ లు. మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో విటమిన్లు, అవసరమైన ఖనిజాలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు ఎక్కువగా ఉండే ఈ గిజంలను తప్పకుండా రెగ్యులర్ గా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుప్పెడు బాదం పప్పులను రాత్రంతా నానబెట్టి వాటి మీద ఉన్న పీల్ ను తీసేసి తినండి. రోజూ గుప్పెడు బాదం పప్పులను తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

యాంటీ ఆక్సిడెంట్స్ 

యాంటీ ఆక్సిడెంట్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి కణాలను దెబ్బతినకుండా రక్షించడానికి మన శరీరానికి చాలా చాలా అవసరం. ఆక్సీకరణ ఒత్తిడి, మంట, వృద్ధాప్యం నుంచి శరీరాన్ని రక్షించే యాంటీఆక్సిడెంట్లకు గొప్ప వనరులలో బాదం ఒకటి. అయితే యాంటీ ఆక్సిడెంట్లను పొందడానికి బాదం చర్మాన్ని అలాగే తినేయండి. ఎందుకంటే బాదం పీల్ లో యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 
 

 

36

విటమిన్ ఇ

విటమిన్ ఇ మన శరీరానికి చాలా చాలా అవసరం. గుండె పనితీరుకు సహాయపడే ముఖ్యమైన విటమిన్లలో విటమిన్ ఇ ఒకటి. అల్జీమర్స్ ఉన్నవారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బాదం పప్పులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. 28 గ్రాముల బాదం తినడం వల్ల రోజువారీ విటమిన్ ఇ లో 50% తీరుతుంది. 
 

46
almond

almond

మెగ్నీషియం 

బాదం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఆహారం. బాదం పప్పుల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది చాలా మందికి తెలియదు. మెగ్నీషియం శరీరంలో 200 కంటే ఎక్కువ విధులను నిర్వహిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన వ్యక్తి రోజూ 420 మిల్లీగ్రాముల మెగ్నీషియాన్ని తీసుకోవాలి.
 

56

బరువు తగ్గుతారు

28 గ్రాముల బాదంలో 3.5 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. బాదంను డైటరీ ఫైబర్ కు మంచి వనరుగా భావిస్తారు. ప్రతిరోజూ ఉదయం గుప్పెడు బాదం పప్పులు తింటే ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుంది. ఫలితంగా ఇది రోజంతా కేలరీల తీసుకోవడాన్ని తగ్గిస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది.
 

66

బాదం గుండెకు ఎంతో మేలు చేస్తుంది

బాదం పప్పులో మెగ్నీషియం  పుష్కలంగా ఉంటుంది. ఇది గుండెకు ఎంతో మేలు చేస్తుంది. రక్తపోటును నియంత్రించడానికి బాదం ఎంతో సహాయపడుతుందని అనేక అధ్యయనాలు కనుగొన్నాయి. బాదంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తపోటును తగ్గిస్తాయి. బాదం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందని కూడా నమ్ముతారు. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Isabgol Benefits: దీన్ని నీళ్లల్లో నానబెట్టి తాగితే పొద్దున్న కల్లా మీ మలబద్ధకం పరార్, షుగర్ కంట్రోల్ లో ఉంటుంది
Recommended image2
Ice Apple: తాటి ముంజల్లో ఇన్ని పోషకాలా? తెలిస్తే బుట్టలు బుట్టలు కొంటారు
Recommended image3
Coriander Benefits: రోజులో ఒక్కసారి కొత్తిమీర వాటర్ తాగితే షుగర్ కంట్రోల్ అవ్వడం పక్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved