బర్డ్ ఫ్లూ లక్షణాలు ఇవే.. నివారణ ఇలా...
బర్డ్ ఫ్లూ కరోనా అంతటి ప్రమాదకారేనా? దీని లక్షణాలేమిటి? చికిత్స ఉందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చికెన్ తినడం మానేస్తే సరిపోతుందా? అనే అనుమానాలు చాలామందిని వేధిస్తున్నాయి. బర్డ్ ప్లూ వేగంగా విస్తరిస్తున్న నేటి తరుణంలో దీని గురించి కొంత అవగాహన ఉండడం మంచిది.

అయితే ఈ సీజన్ లో రెగ్యులర్ గా పక్షుల్లో కనిపించే వ్యాధేనని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కాకపోతే జాగ్రత్తలు తప్పనిసరి. ముఖ్యంగా కరోనా కొత్త కొత్తగా విజృంభిస్తున్న నేటి తరుణంలో అలాంటి లక్షణాలే ఉండే ఈ ఫ్లూ బారిన పడకుండా ఉండడమే మంచిది.

ఇప్పటికే కేరళ, మధ్యప్రదేశ్, గుజరాత్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో ఈ ఫ్లూ వెలుగుచూసింది. తాజాగా మహారాష్ట్ర, ఢిల్లీలోనూ బర్డ్ ఫ్లూ వెలుగుచూసిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటితో కలిపి దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ సోకిన రాష్ట్రాల సంఖ్య 9కి చేరింది.

ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా అని పిలవబడే బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు వివిధ రాష్ట్రాల్లో పక్షులు, కోళ్లు, బాతులు చనిపోవడంతో బయటపడ్డాయి. ఇది పక్షుల్లో వ్యాపించే ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్. ఈ వ్యాధి ప్రధానంగా H5N1 వైరస్ ద్వారా వ్యాపిస్తుంది.

ఇన్ఫెక్షన్ సోకిన పక్షుల ద్వారా ఈ వైరస్ మనుషులకు, జంతువులకు కూడా వ్యాపించే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది సాధారణంగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాపించదు.

కానీ దీని వల్ల కొత్త వైరస్ స్ట్రెయిన్ మనుషుల్లో అభివృద్ధి చెంది, అవి మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశాలు లేకపోలేదు. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ముందు నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నివారణ చర్యల గురించి అవగాహన పెంచుకోవాలి.

వలస పక్షుల ద్వారా మన దేశంలో బర్డ్ ఫ్లూ వ్యాపించి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. పౌల్ట్రీల్లో పెంచే కోళ్లు, బాతులు, ఇతర పక్షులకు వైరస్ సోకి చనిపోతున్నాయి. ఇతర ప్రాంతాలకు కూడా వైరస్ వ్యాప్తి చెందుతోంది.

సాధారణంగా వ్యాధి సోకిన పక్షి మలం, ముక్కు, నోరు లేదా కళ్ళ నుండి విడుదలయ్యే స్రావాలు అంటుకుంటే, వాటి ద్వారా వైరస్ మనుషులకు కూడా వ్యాపిస్తుంది. వ్యాధి ఆనవాళ్లు బయటపడ్డ ప్రాంతాల్లో పౌల్ట్రీ ఉత్పత్తులు, గుడ్లను ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉడికించి తినాలి.

మనుషుల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలు ఇతర వైరల్ వ్యాధుల లక్షణాల మాదిరిగానే ఉంటాయి. దగ్గు, జ్వరం, తలనొప్పి, విరేచనాలు, శ్వాసకోశ సమస్యలు, ముక్కు కారటం, గొంతు నొప్పి, కండరాల నొప్పులు వంటివి కనిపిస్తే ఆలస్యం చేయకుండా చికిత్స తీసుకోవాలి.

బర్డ్ ఫ్లూ సోకిన, చనిపోయిన పక్షులకు దూరంగా ఉండటం వల్ల వైరస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. వ్యాధి బయటపడ్డ కోళ్ల ఫారాలు, ఇతర ప్రాంతాలు, బహిరంగ మార్కెట్లకు వెళ్లకూడదు.

చికెన్, గుడ్లు వంటి పౌల్ట్రీ ఉత్పత్తులను అధిక ఉష్ణోగ్రతల వద్ద బాగా ఉడికించి తినాలి. మాంసాన్ని వండేందుకు ప్రత్యేకమైన పాత్రలను వాడాలి.

పరిశుభ్రత పాటించడం, సబ్బుతో చేతులు కడుక్కోవడం వల్ల కూడా బర్డ్ ఫ్లూ ప్రమాదాన్ని నివారించవచ్చు.

పౌల్ట్రీ రైతులు, హెల్త్ కేర్ వర్కర్లు, వ్యాధి బయటపడ్డ ప్రాంతాల్లోని వ్యక్తులకు ఈ వైరస్ సోకే అవకాశం ఉంది. వీరు పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లోవ్స్, బూట్లు, హెడ్ కవర్ వంటివి వాడటం మంచిది.

మనిషికి సోకిన బర్డ్ ఫ్లూ వైరస్ రకాన్ని బట్టి చికిత్స ఉంటుంది. సాధారణంగా వైరస్ తీవ్రతను తగ్గించడానికి యాంటీవైరల్ మందులను రోగులకు ఇస్తారు.

కానీ లక్షణాలు కనిపించిన 48 గంటలలోపు మందులు వాడటం ప్రారంభించాలి. తీవ్రమైన ఇన్ఫెక్షన్ బారిన పడినవారికి వెంటిలేటర్ పెట్టి చికిత్స అందించాల్సి ఉంటుంది.