MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • బరువు ఎక్కువున్న ఆడవారికే ఆ సమస్య వస్తుందా?

బరువు ఎక్కువున్న ఆడవారికే ఆ సమస్య వస్తుందా?

బరువు ఎక్కువున్న ఆడవారు ఎండాకాలంలో మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది. కడుపు, నడుము, తొడల భాగంలో ఎక్కువగా నిల్వ ఉన్న కొవ్వు చెమట, సంక్రమణకు కారణమవుతుంది.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 19 2023, 09:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
vaginal infection

vaginal infection

స్థూలకాయంతో బాధపడుతున్న ఆడవారు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. బరువు పెరగడం వల్ల సన్నిహిత ప్రాంతంలో ముఖ్యంగా తొడలలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. దీని వల్ల ఆ ప్రాంతానికి సరిగా గాలి వెళ్లదు. అంతేకాదు అక్కడ విపరీతమైన చెమటలు పడుతుంటాయి. గాలి లేకపోవడం వల్ల యోనిపై, యోని చుట్టూ ఉన్న చర్మంపై చెమట పేరుకుపోతుంది. దీనివల్ల దద్దుర్లు, గడ్డలు, దురద వంటి సమస్యలు వస్తాయి. అలాగే బరువు ఎక్కువగా ఉన్న మహిళలకు యూటీఐ సంక్రమణ, ఇతర యోని ఇన్ఫెక్షన్ల ప్రమాదం కూడా ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
vaginal infection

vaginal infection

బరువు తగ్గడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. డయాబెటిస్, గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. యోని ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉండదు. బరువెక్కువున్న మహిళలు పీరియడ్స్, మెనోపాజ్, తేమతో కూడిన వాతావరణంలో అంటువ్యాధులకు ఎక్కువగా గురవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇలాంటి వారు సన్నిహిత ప్రాంతాన్ని ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

37
vaginal infection

vaginal infection

కాటన్ దుస్తులు ధరించండి

బరువెక్కువున్న మహిళలు తమ శరీర పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే వీరి సన్నిహిత ప్రాంతంలో చెమట ఎక్కువగా పడుతుంది. ఇది సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే వదులుగా ఉండే దుస్తులనే వేసుకోవాలి. దీంతో గాలి యోనికి బాగా చేరుతుంది. వీటితో పాటుగా తేలికపాటి కాటన్ ప్యాంట్లు కూడా ధరించాలి. ఇలా చేయడం వల్ల యోని చర్మంపై క్రిములు పెరగకుండా, ఎండాకాలంలో యోని ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 

47

ప్రైవేట్ ప్రాంతంలో జుట్టు

ప్రైవేట్ ప్రాంతంలో  జుట్టు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఈ హెయిర్ ను మైనం లేదా హెయిర్ రిమూవల్ క్రీమ్ తో తొలగిండం మానుకోండి. నిపుణుల ప్రకారం.. ఈ పద్ధతులు చాలా ప్రమాదకరం. వీటి వల్ల యోనిలో దద్దుర్లు, ఇతర రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే ఈ జుట్టును పూర్తిగా తొలగించడం కూడా సురక్షితం కాదు. వీటిని పూర్తిగా తొలగిస్తే సంక్రమణ ప్రమాదం పెరుగుతుంది. ఇది బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మక్రిములను మీ యోనిలోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది. ఈ జుట్టును తొలగించాలనుకుంటే ట్రిమ్మింగ్ దీనికి మంచి ఎంపిక. ప్రైవేట్ భాగంలోని జుట్టును ట్రిమ్మర్ తో తీసేయండి. 
 

57

పరిశుభ్రత ఉత్పత్తులను ఉపయోగించండి

గైనకాలజిస్టుల ప్రకారం.. సన్నిహిత ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి ఎస్ఎల్ఎస్ లేని ఉత్పత్తులను ఉపయోగించాలి. సబ్బు, ఇతర బాడీ వాష్ లు వంటి ఎస్ఎల్ఎస్ కలిగిన ఉత్పత్తులు యోని పిహెచ్ స్థాయిని ప్రభావితం చేస్తాయి. ఇది సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది. మీకు యోని ఇన్ఫెక్షన్ ఉంటే, అందులోనూ అది చాలా కాలం పాటు కొనసాగితే వీలైనంత తొందరగా హాస్పటల్ కు వెళ్లండి. ఎండాకాలంలో  యోని ఇన్ఫెక్షన్లు త్వరగా నయం కావు. ముఖ్యంగా మీరు ఓవర్ వెయిట్ ఉంటే. ఇది పెద్ద సమస్యగా మారుతుంది.
 

67

యోనిని, ప్యాంటీని పొడిగా ఉంచండి

ప్రతిసారీ బాత్రూమ్ కు వెళ్లొచ్చిన తర్వాత మీ యోనిని, లోదుస్తులను పూర్తిగా ఆరబెట్టడం చాలా ముఖ్యం. దీని కోసం మూత్ర విసర్జన చేసిన ప్రతిసారీ మీ యోనిని టిష్యూ పేపర్  తో తుడిచి  బాగా ఆరబెట్టండి. చెమట కారణంగా ప్యాంటీ తడిసిపోతే మీరు ప్యాంటీలైనర్, చెమట ప్యాడ్ ను ఉపయోగించొచ్చు. ఇది యోని బ్యాక్టీరియా,  ఫంగస్ లేకుండా ఉండటానికి, సంక్రమణ నుంచి రక్షించడానికి సహాయపడుతుంది.
 

77


చెకప్ లు అవసరం

నిపుణుల ప్రకారం.. మీరు ఎక్కువ బరువున్నా లేకపోయినా.. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా యోని పరీక్షలు చేయించుకోవాలి. మీ యోని ఉత్సర్గలో మార్పు ఉన్నా, మీ ఉత్సర్గ చెడు వాసన ఉన్నా ఇది సంక్రమణను సంకేతం. కాబట్టి వీటిని నిర్లక్ష్యం చేయకండి. ఈ విషయాలను డాక్టర్ తో చెప్పండి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Drinking Water Before Brushing: ఉదయం బ్రష్‌ చేయకుండా నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?
Recommended image2
ఎప్పుడూ ఒక‌వైపే న‌మిలి తింటున్నారా.? ఏం జ‌రుగుతుందో తెలిస్తే వెంట‌నే ఆపేస్తారు
Recommended image3
ట్యాబ్లెట్స్ కంటే ఇంజ‌క్ష‌న్‌తో త్వ‌ర‌గా రిలీఫ్ ఎందుకు వ‌స్తుంది? వెనుకున్న సైన్స్ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved