ఊబకాయంతో పురుషులకు సంతానలేమి ముప్పు.. ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలంటే..!
ఊబకాయం రోగం కాదు కానీ ఇది ఎన్నో రోగాలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఊడకాయం గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాదు ఊబకాయం కూడా పురుషుల్లో సంతానలేమికి కారణమవుతుందంటున్నారు నిపుణులు.

ఊబకాయం అనేది శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయే వ్యాధి. శరీరంలో కొవ్వు పేరుకుపోవడం ఒక వ్యాధి కాదు. కానీ దీని వల్ల శరీరం సరిగా పనిచేయదు. ఆరోగ్యం కూడా బాగా క్షీణిస్తుంది. మీ శరీరాన్ని ఎన్నో రోగాలకు గురిచేస్తుంది. కానీ పురుషులలో ఊబకాయం పురుషుల వంధ్యత్వ ప్రమాదాన్ని పెంచుతుందన్న సంగతి మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. అవును ఊబకాయం ఉన్న పురుషులకు పిల్లలు పుట్టడం కష్టమేనట.
ఊబకాయం వల్ల వీర్యకణాల సంఖ్య తగ్గుతుంది. అలాగే స్పెర్మ్ చలనశీలత కూడా తగ్గుతుందట. దీంతో గర్భం ధరించడంలో ఇబ్బంది కలుగుతుంది. ఊబకాయం హార్మోన్లలో మార్పులను కలిగిస్తుంది కూడా. దీని వల్ల స్పెర్మ్ తయారీ ప్రక్రియ దెబ్బతింటుంది. ఈ కారణంగా వంధ్యత్వం పురుషులలో కూడా సంభవిస్తుంది. ఊబకాయానికి కారణాలేంటో? దాన్ని ఎలా నివారించాలో ఇప్పడు తెలుసుకుందాం..
ఊబకాయం ఎందుకు వస్తుంది?
మీ శరీరం కేలరీలను బర్న్ చేయలేనప్పుడు.. అది కొవ్వుగా మారి శరీరంలో పేరుకుపోవడం ప్రారంభిస్తుంది. దీనికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. అవేంటంటే?
ఊబకాయం బారిన పడటానికి అనారోగ్యకరమైన ఆహారాలను తినడమే ప్రధాన కారణం. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కేలరీలు బాగా పేరుకుపోతాయి. ఎక్కువ వేయించిన లేదా కారంగా ఉండే ఆహారాలు కూడా మీ శరీరంలో కేలరీల స్థాయిలను పెంచుతాయి.
obesity
ఊబకాయానికి కూడా మానసిక ఆరోగ్యం కూడా కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. యాంగ్జైటీ, డిప్రెషన్, విసుగు, ఒంటరితనం కారణంగా ఒక్కోసారి అవసరానికి మించి తినడం మొదలుపెడతారు. దీంతో మీరూ ఊబకాయం బారిన పడతారు.
జన్యుపరమైన కారణాలు కూడా ఊబకాయం ప్రమాదాన్ని పెంచుతాయి. జన్యుపరమైన కారణాల వల్ల మీ జీవక్రియ నెమ్మదిగా ఉంటుంది. దీంతో కేలరీలను బర్న్ చేయడానికి చాలా సమయం పడుతుంది లేదా మీరు కొంచెం ఆహారం తిన్నా బరువు బాగా పెరిగిపోతారు.
హార్మోన్ల మార్పుల వల్ల కూడా అతిగా తినే అవకాశముంది. తినాల్సిన అవసరం లేకపోయినా తినాలనే కోరిక దీనివల్ల కలుగుతుంది. దీనివల్ల ఎక్కువగా తిని విపరీతంగా బరువు పెరుగుతారు.
దీన్ని ఎలా నివారించాలంటే?
స్థూలకాయానికి చికిత్స చేయడం కంటే నివారించడం సులభం. ఒకసారి ఊబకాయానికి గురైన తర్వాత దానికి చికిత్స చేయడం చాలా కష్టమవుతుంది. అందువల్ల అందుకే దీనిని నివారించడం మరింత ప్రయోజనకరమైన పరిష్కారం. ఇందుకోసం ఏం చేయాలంటే?
వ్యాయామం : వ్యాయామం మిమ్మల్ని ఎన్నో రోగాల నుంచి రక్షిస్తుంది. మిమ్మల్ని ఫిట్ గా కూడా ఉంచుతుంది. ఎక్సర్ సైజెస్ మీ శరీర కొవ్వును కరిగించడానికి సహాయపడుతాయి. దీనివల్ల ఊబకాయం ముప్పు కూడా తగ్గుతుంది. ఇందుకోసం ప్రతి రోజూ 30 నిమిషాల పాటు వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, యోగా వంటివి చేస్తే సరిపోతుంది.
ఆరోగ్యకరమైన ఆహారం: ఊబకాయం బారిన పడొద్దంటే మీ రోజువారి ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, గింజలు, పాలు, పెరుగు, జున్ను, తృణధాన్యాలు మొదలైనవి చేర్చండి. అలాగే ఫాస్ట్ ఫుడ్, ఆయిల్, మసాలా దినుసులను తక్కువగా తినడానికి ప్రయత్నించండి. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినకుండా ఉండటానికి మఖానా, మిక్స్ ట్రయల్ వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ ను తినొచ్చు.
చురుకైన జీవనశైలి: ఫోన్ లేదా టీవీ వంటి ఎలక్ట్రానిక్ స్క్రీన్ సమయాన్ని తగ్గించండి. ప్రతిరోజూ వాకింగ్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన అవుట్ డోర్ గేమ్స్ ను ఆడండి. ఇది మీ జీవనశైలిని చురుకుగా చేస్తుంది. కేలరీలను కూడా బర్న్ చేస్తుంది.