స్నానం ఎప్పుడు చేస్తే మంచిదో తెలుసా?
ప్రపంచంలోని చాలా దేశాల్లో ఉదయాన్నే కాకుండా.. రాత్రిపూట స్నానం చేసే అలవాటు ఉంది. అసలు స్నానం ఏ పూట చేస్తే మంచిదో తెలుసా?
స్నానానికి సరైన సమయం
ప్రపంచంలో ఒక్కో ప్రదేశంలో ఒక్కో విధంగా స్నానం చేస్తుంటారు. కానీ అంతటా స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కానీ మన దేశంలో మాత్రం ప్రాచీన కాలం నుంచి ఉదయాన్నే స్నానం చేయడం మంచిదని భావిస్తుంటారు.
కానీ చాలా దేశాల్లో మాత్రం ఉదయం స్నానం చేయడం వల్ల ఎలాంటి లాభం ఉండదని నమ్ముతారు. అందుకే ఇలాంటి దేశాల్లోనే ఉదయం కాకుండా రాత్రిపూట స్నానం చేస్తుంటారు. అయితే స్నానం ఎప్పుడు చేస్తే మంచిది అన్న విషయం గురించి శాస్త్రవేత్తలకు కూడా భిన్నాభిప్రాయాలున్నాయి.
స్నానానికి సరైన సమయం
జపాన్‌లో ఎన్నో ఏండ్ల నుంచి కూడా రాత్రిపూటే స్నానం చేసే అలవాటు ఉంది. రాత్రిపూట స్నానం చేస్తే పగటిపూట శరీరానికి అంటుకున్న మురికి పోతుందని, ఒంట్లో చేరిన విష పదార్థాలు బయటకు పోతాయని నమ్ముతారు.
జపనీస్ స్నాన సంస్కృతిలో ఆన్సెన్ , ఆఫ్రోఉన్నాయి. వీళ్లు స్నానం చేయడానికి ముందు శరీరాన్ని పూర్తిగా శుభ్రం చేసుకుంటారు. తొట్టిలో ఉండే వాటర్ గోరువెచ్చగా ఉంటుంది. కాబట్టి వీళ్లు వీటితోనే స్నానం చేస్తారు. ఇది వారి అలసటను తగ్గిస్తుంది.
స్నానానికి సరైన సమయం
జపనీయులు రాత్రిపూట స్నానం చేస్తే రాత్రిపూట బాగా నిద్రపడుతుందని, మానసిక ఆరోగ్యం బాగుంటుందని నమ్ముతారు. ఇదే వారు రాత్రిపూట స్నానం చేయడానికి అసలు కారణం.
రాత్రి స్నానం మనసును, శరీరాన్ని పూర్తిగా శుభ్రపరుస్తుందని కూడా వారు నమ్ముతారు. జపనీస్ సంప్రదాయాల్లో స్నానం ఒక ముఖ్యమైన భాగం. జపనీస్ స్నానం, వారి పని సంస్కృతికి దగ్గరి సంబంధం ఉంటుంది. చాలా మంది జపనీయ కార్మికులు ఎక్కువ సేపు ఒత్తిడితో కూడిన పని చేస్తారు.
సాధారణంగా వీళ్లు ఉదయం నుంచి రాత్రి వరకు పని చేస్తారు. అయితే పడుకునే ముందు స్నానం చేయడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. దీంతో బాగా నిద్రపడుతుంది.
ఇకపోతే దక్షిణ కొరియాలో కూడా రాత్రపూటే స్నానం చేస్తారు. వీరు పగలంతా పనిచేసి రాత్రి స్నానం చేస్తే అలసట తగ్గుతుందని అంటారు.
స్నానానికి సరైన సమయం
చైనాలో స్నానం ఎప్పుడు చేస్తారు?
చైనా సంస్కృతిలో రాత్రిపూటే స్నానం చేస్తారు. రాత్రిపూట స్నానం చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. రోజంతా మనసులో చేరిన చెడు ఆలోచనలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. దీంతో శరీరానికి ఉత్సాహం కలుగుతుంది. అలాగే రాత్రిపూట బాగా నిద్రపడుతుంది. చైనా వాతావరణం చాలా వేడిగా, తేమ ఉంటుంది.
అందుకే అక్కడి ప్రజలకు చెమట ఎక్కువగా పడుతుంది. దీంతో చర్మంపై బ్యాక్టీరియా పేరుకుపోతుంది. పడుకునే ముందు స్నానం చేస్తే శరీరం శుభ్రంగా ఉంటుంది. ఇన్ఫెక్షన్లకు దూరంగా కూడా ఉంటారు.
బ్రెజిలియన్లు స్నానం ఎప్పుడు చేస్తారు?
లాటిన్ అమెరికా, ముఖ్యంగా బ్రెజిల్, మెక్సికో, కొలంబియాల్లోని ప్రజలు వారానికి సగటున 8 నుంచి 12 సార్లు స్నానం చేస్తారట. ఎందుకంటే లాటిన్ అమెరికాలో వాతావరణం వేడిగా ఉంటుంది.అలాగే పరిశుభ్రత ప్రమాణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీనివల్లే వారు తరచుగా స్నానం చేస్తారు.
బ్రెజిలియన్లు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి లేదా శారీరక శ్రమ తర్వాత ఒకసారి ఖచ్చితంగా స్నానం చేస్తారు. ఇది అక్కడ సర్వ సాధారణం.
స్నానానికి సరైన సమయం
అమెరికా, యూరప్, కెనడా వంటి పాశ్చాత్య సంస్కృతుల్లో ఉదయం స్నానం చేయడం వల్ల ఉత్సాహంగా రోజును స్టార్ట్ చేస్తారు. ఇకపోతే ప్రాచీన ఈజిప్టులో, భారతదేశంలోలాగే, స్నానం పవిత్రత, దైవారాధనకు సంబంధించినదిగా భావించారు. ఇస్లామిక్ సంస్కృతిలో కూడా ఉదయం స్నానం చేయడం మంచిదని చెప్తారు..
శాస్త్రం ఏం చెబుతోంది?
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాత్రిపూట స్నానం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. రోజంతా పనిచేసిన తర్వాత పడుకునే ముందు స్నానం చేస్తే శరీరం ఉత్సాహంగా ఉంటుంది. రాత్రిపూట స్నానం చేస్తే అలసట తగ్గి బాగా నిద్రపడుతుంది.