నెయ్యితో దగ్గు, జలుబు మాయం..! ఎలా ఉపయోగించాలంటే?
నెయ్యిని చాలా వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. నిజానికి ఇది ఫుడ్ ను టేస్టీగా చేయడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అవును ఇది సీజన్ మారుతున్నప్పుడు వచ్చే దగ్గు, జలుబు వంటి ఎన్నో సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
వాతావరణంలో కొంచెం మార్పొచ్చినా దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. వీటివల్ల పిల్లలే కాదు పెద్దలు కూడా ఇబ్బంది పడతారు. వీటిని వీలైనంత తొందరగా వదిలించుకోపోతే జ్వరం కూడా వస్తుంది. ఆయుర్వేదం ప్రకారం.. నెయ్యిలో ఈ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. నెయ్యిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. దేశీ నెయ్యి కఫం-శ్లేష్మాన్ని తొలగిస్తుంది. ముక్కు దిబ్బడ కూడా తగ్గుతుంది.
పాలతో నెయ్యి
పాలతో పాటుగా నెయ్యిని తీసుకుంటే కూడా దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఇందుకోసం పాలను వేడి చేసి అందులో కొద్దిగా నెయ్యి, సెలెరీని వేసి కలపండి. పడుకునే ముందు ఈ పాలను తాగితే సమస్యలన్నీ తగ్గిపోతాయి. సెలెరీ, నెయ్యి రెండింటిలో యాంటీ బాక్టీరియల్ గుణాలుంటాయి. ఇవి అంటు వ్యాధులను తగ్గిస్తాయి. అంతేకాకుండా నెయ్యి మన శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. కఫ సమస్యలు కూడా రావు.
నెయ్యి, నల్ల మిరియాల టీ
నెయ్యి, నల్ల మిరియాల టీ ని తయారుచేసి తాగితే కూడా సమస్యలు తగ్గిపోతాయి. వీటితో టీని తయారు చేసి తాగితే గొంతునొప్పి, కఫం సమస్యలు తగ్గిపోతాయి. నల్లమిరియాలు, నెయ్యిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇందుకోసం ఒక టీస్పూన్ నెయ్యిని రెండు చిటికెడు నల్ల మిరియాలు, కొద్దిగా అల్లం నీటిలో కలిపి మరిగించి వడకట్టి తాగాలి.
Image: Freepik
తేనె, నెయ్యి మిశ్రమం
ఒక టీస్పూన్ నెయ్యిలో తేనె కలపండి. దీన్ని మీరు రాత్రి పడుకునే ముందు నాకండి. రుచి ఎలా ఉన్నా దీన్ని తీసుకునేటప్పుడు నీళ్లను అస్సలు తాగకండి. ఇది ఛాతీలోని కఫాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది పొడి దగ్గును తొందరగా తగ్గిస్తుంది.
గోరువెచ్చని నెయ్యి
ముక్కు దిబ్బడ సర్వసాధారణ సమస్య. కానీ దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. అయితే ఈ సమస్యను నెయ్యి తగ్గిస్తుంది. ఇందుకోసం నెయ్యిని గోరువెచ్చగా చేసి 2 చుక్కలను ముక్కులో వేయండి. ఇది ముక్కులో కఫం రద్దీని తగ్గిస్తుంది. మూసుకుపోయిన ముక్కును తెరుస్తుంది. దీంతో మీరు శ్వాసను బాగా తీసుకోగలుగుతారు.