Health Tips: ఎడతెరపి లేని దగ్గు ఇబ్బంది పడుతుందా.. సత్వర ఉపశమనం కోసం ఈ చిట్కాలు పాటించండి!
Health Tips: సాధారణమైన దగ్గు అందరికీ వస్తూనే ఉంటుంది. అయితే ఎడతెరపిలేని దగ్గు మనల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. ఇలాంటి దగ్గు ని తగ్గించాలంటే ఇంట్లోనే కొన్ని చిట్కాలు ఉన్నాయి అవేంటో చూద్దాం.
కరోనా వచ్చిన దగ్గరనుంచి దగ్గు వచ్చిందంటే చాలు భయాందోళనలోకి గురవుతున్నారు ప్రజలు. ఏ దగ్గు ఏ అనారోగ్యాన్ని సూచిస్తుందో తెలుసుకోలేని పరిస్థితి. ఎడతెరిపి లేకుండా వచ్చే దగ్గు మనిషిని కుంగదీస్తుంది.
అయితే కొన్ని చిట్కాలను పాటించి ఆ దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు అవి ఏమిటో చూద్దాం. దగ్గు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు రోజు ఉదయాన్నే రెండు చెంచాల తిప్పతీగ రసాన్ని నీటిలో కలిపి తాగండి.
తిప్పతీగ రసం రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా మూడు దోషాలైనా వాత, పిత్త,కఫ ల మధ్య సమన్వయం చేస్తుంది. దగ్గు మరీ ఎక్కువగా ఉంటే మిరియాల కషాయం తాగండి. లేదంటే చిటికెడు నల్ల మిరియాల పొడిని నెయ్యితో కలిపి కడుపు నిండుగా ఉన్నప్పుడు తినండి.
అలాగే రోజు రెండు పూటలా గ్లాసు పాలల్లో కాస్త అల్లం లేదా వెల్లుల్లి వేసి మరిగించండి. ఆ తరువాత పసుపు వేసి గోరువెచ్చగా తాగితే దగ్గు నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. పసుపులో కర్క్యూమిన్ అనే పదార్థం వైరస్, బ్యాక్టీరియా, వాపు వంటి లక్షణాలని తగ్గిస్తుంది.
అలాగే వేడివేడి మసాల టీ తాగినా దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. దానిమ్మ రసంలో చిటికెడు అల్లం పొడి, పిప్పళ్ళ పొడిని కలిపి తాగినా దగ్గు తగ్గుతుంది. దానిమ్మలో ఉండే విటమిన్ ఏ మరియు సి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
అయితే ఈ చిట్కాలు అన్నీ తాత్కాలిక ఉపశమనం కోసమే. మీకు దగ్గు 24 గంటలు కన్నా ఎక్కువసేపు ఎడతెరిపి లేకుండా దగ్గు వస్తుందంటే మీరు కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది.