శరీరంలో విటమిన్ 'ఎ' లోపిస్తే ఏం జరుగుతుంది.. తగ్గకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి!
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని విటమిన్ల మాదిరిగానే విటమిన్ ఎ (Vitamin A) కూడా చాలా అవసరం.

ఇది శరీరంలోని కణాలు జబ్బులు బారినపడకుండా ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అదే శరీరానికి ఎంతగానో ఉపయోగపడే విటమిన్ ఎ లోపిస్తే అనేక అనారోగ్య సమస్యలు (Health problems) వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ లోపం కారణంగా కలిగే అనారోగ్య సమస్యలు, లోపాన్ని తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
విటమిన్ ఎ వృక్ష సంబంధిత ఆహారంలో బీటా కెరోటిన్ (Beta carotene) గా ఉంటుంది. శాకాహార పదార్థాలలో విటమిన్ ఎ ఉండదు. పండ్లు, ఆకుకూరలను మనం తిన్నప్పుడు ఇందులో ఉండే బీటా కెరోటిన్ కరిగి రక్తంలో నుంచి లివర్ లోకి వెళ్లిన తరువాత విటమిన్ ఎ గా మారుతుంది. అందుకే శాఖాహార పదార్థాలన్నింటిలో (Vegetarian) విటమిన్ ఎ డైరెక్టుగా ఉండదు. శాకాహార పదార్థాలలో బీటా కెరోటిన్ ఉంటుంది. బీటా కెరోటిన్ ను లివర్ విటమిన్ ఎ గా మారుస్తుంది.
చేపలు, గుడ్డు, కోడి వంటి మాంసాహార (non-vegetarian) పదార్థాలను తీసుకున్నప్పుడు విటమిన్ ఎ డైరెక్ట్ (Direct) గా లభిస్తుంది. శరీరానికి అన్ని విటమిన్లను రోజులో తగిన మోతాదులో అందించాలి. కానీ విటమిన్ ఎ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను రెండు నెలల పాటు తరచుగా తీసుకుంటే ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు శరీరంలో విటమిన్ ఎ నిల్వఉంటుంది.
శరీరానికి కావలసిన మోతాదులో విటమిన్ ఎ ఉండకపోతే అనారోగ్య సమస్యలు కలుగుతాయి. దీని లోపం శరీరంలో మరింత ఎక్కువగా ఉంటే ఆరోగ్యం ప్రమాదంలో (Danger) ఉన్నట్టే. విటమిన్ ఎ లోపాన్ని (Vitamin A deficiency) తగ్గించుకోవడం కోసం సరైన ఆహారపు నియమాలను పాటించడం అవసరం. అప్పుడే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.
కంటి సమస్యలు ఏర్పడతాయి: శరీరంలో విటమిన్ ఎ లోపిస్తే కంటి కింద చర్మం పొడిబారడం, దృష్టిలోపం వంటి కంటి సమస్యలు ఏర్పడతాయి. అంతేకాకుండా ఈ లోపం మరింత ఎక్కువగా ఉంటే అంధత్వం (Blindness), రేచీకటి (Nyctalopia) వంటి కంటి సమస్యలు ఏర్పడతాయి. కనుక విటమిన్ ఎ అధికంగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలి.
చర్మ సమస్యలు ఏర్పడతాయి: చర్మ కణాల ఆరోగ్యానికి, ఉత్పత్తికి విటమిన్ ఎ ఉపయోగపడుతుంది. కానీ శరీరంలో దీని లోపం ఏర్పడితే చర్మం పొడిబారి దురద (Itching), మంట, వాపు వంటి చర్మ సమస్యలు (Skin problems) ఏర్పడతాయి. కనుక చర్మ సమస్యలు ఏర్పడడానికి ఇతర సమస్యలతో పాటు విటమిన్ ఎ గా కూడా గుర్తించాలి.
సంతాన లోపం: మహిళల్లో విటమిన్ ఎ లోపిస్తే సంతాన లోపం (Infertility), పిండం ఎదుగుదల సరిగా లేకపోవడం, అబార్షన్లు జరగడం, శిశువు పుట్టుకతోనే అనారోగ్య సమస్యలతో పుట్టడం వంటి సమస్యలు కలుగుతాయి. అలాగే దీని లోపం కారణంగా పురుషులలో శుక్రకణాల ఉత్పత్తి (Sperm production) తగ్గుతుంది.
గొంతు, ఛాతి ఇన్ఫెక్షన్లు: గొంతు, ఛాతి ఇన్ఫెక్షన్లకు (Infections) ఇతర సమస్యలతో పాటు విటమిన్ ఎ లోపం కూడా కారణం. కనుక విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇందుకోసం తీసుకునే ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ (Special attention) వహించాలి. అప్పుడే గొంతు, ఛాతి ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండవచ్చు.
విటమిన్ ఎ లోపాన్ని తగ్గించుకోవడానికి క్యారెట్, బొప్పాయి, కమల పండు, పాలకూర, గోంగూర, మునగాకు, కరివేపాకు, కొత్తిమీర వంటి పండ్లు (Fruits), ఆకుకూరలను (Leafy vegetables) తీసుకోవడంతోపాటు చేపలు, గుడ్డు, కోడి, మాంస పదార్థాలను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.