డైట్ డ్రింక్స్ తీసుకుంటున్నారా... అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే?
ప్రస్తుత కాలంలో ఎంతోమంది యువతి యువకులు ఎక్కువగా పగలు రాత్రి అనే తేడా లేకుండా డైట్ డ్రింక్స్ తీసుకోవడం అలవాటుగా మారిపోయింది.అయితే ఇలాంటి కృత్రిమ చెక్కరలు ఉన్నటువంటి పానీయాలు తీసుకోవటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తాజా పరిశోధనల ద్వారా వెళ్లడైంది. మరి కృత్రిమ చక్కెరలు కలిగి ఉన్న రసాయనాలు తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

కృత్రిమ చక్కెరలు అంటే సహజమైన చక్కెరలో ఉన్నన్ని క్యాలరీలు ఇందులో ఉండవు ఇవి ఆహార పదార్థాలను తీపి చేయడంలో పెద్ద ఎత్తున ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా కృత్రిమ చక్కెరలతో తయారు చేసిన పానీయాలను చాలామంది తాగడానికి ఇష్టపడుతున్నారు. చూడటానికి చక్కెరను పోలీ ఉన్నటువంటి ఈ ఆర్టిఫిషియల్ షుగర్ లో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల చాలామంది ఈ ఆర్టిఫిషియల్ షుగర్ తో తయారు చేసిన డ్రింక్స్ అలవాటు చేసుకున్నారు.
ప్రతిరోజు రెండు మూడు రకాల డ్రింక్స్ తాగడమే కాకుండా పెద్ద ఎత్తున పార్టీలు చేసుకున్న సమయంలో కూడా ఈ డైట్ డ్రింక్స్ తాగుతున్నారు. అయితే తాజాగా ఈ డ్రింక్స్ పై న్యూయార్క్‌లోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ రిసెర్చర్స్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ పరిశోధన నిర్వహించారు. ఈ పరిశోధనలలో భాగంగా 50-59 ఏండ్ల వయసున్న 80 వేల మంది మహిళల పై చేసిన అధ్యయనంలో భాగంగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ అధ్యాయంలో భాగంగా ఎక్కువగా ఎవరైతే ఈ డైట్ డ్రింక్స్ తీసుకుంటున్నారో అలాంటి వారిలో గుండె జబ్బులు, పక్షవాతం వంటి సమస్యలు అధికంగా ఉంటాయని ఈ అధ్యాయం ద్వారా నిరూపితమైంది. ఈ అధ్యాయంలో భాగంగా 12 సంవత్సరాల వరకు ప్రతిరోజు రెండు రకాల డైట్ డ్రింక్స్ తీసుకునే వారిలో
వీరిలో ఇస్కీమిక్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం 31 శాతం ఉన్నట్లు తేలింది. ఇలా గుండె జబ్బులతో పాటు ఊబకాయం వచ్చే ప్రమాదం అధికంగా ఉందని నిపుణులు వెల్లడించారు.
ఈ విధంగా చాలామంది యువత ప్రమాదాలు బారిన పడబోతున్నారని ఈ అధ్యాయం ద్వారా నిపుణులు తెలియజేశారు. అయితే ఆర్టిఫిషియల్ షుగర్స్ వల్ల క్యాలరీలు తక్కువగా ఉంటాయని వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని భావించిన యువత పెద్ద ఎత్తున వీటికి బానిసలుగా మారారు. ఈ క్రమంలోనే వీటిని అధికంగా తీసుకోవడం వల్ల ప్రమాదం అంచున పడబోతున్నామని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక తాజాగా పరిశోధనలలో వెల్లడైన ఈ విషయాలను పరిగణలో ఉంచుకొని వీలైనంతవరకు ఈ డైట్ డ్రింక్స్ తాగడం తగ్గిస్తే ఎంతో శ్రేయస్కరమని నిపుణులు తెలియజేస్తున్నారు.