శారీరక ఆరోగ్యాన్ని దృఢంగా ఉంచేందుకు బీట్ రూట్ తప్పనిసరి..
మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారం ఆరోగ్యంపై ప్రభావితం చూపుతుంది. కనుక శారీరక ఆరోగ్యం దృఢంగా ఉండాలంటే ఆహార జీవనశైలిలో ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి. కాబట్టి ఎన్నో పోషకాలను కలిగిన బీట్ రూట్ (Beat root) ను తీసుకుంటే శారీరక ఆరోగ్యం దృఢంగా ఉంటుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు మనం బీట్ రూట్ ను తరచూ తీసుకుంటే కలిగే ప్రయోజనాల (Benefits) గురించి తెలుసుకుందాం..

Beat root
బీట్ రూట్ లో మెగ్నీషియం, జింక్, కాపర్, పొటాషియం వంటి తదితర పోషకాలు (Nutrients) సమృద్ధిగా ఉంటాయి. వీటితో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా ఉంటాయి. ఈ ఔషధ గుణాలు పోషకాహార లోపం, త్వరగా అలసిపోవడం లేదా నీరసించడం, జుట్టురాలిపోవడం ఇలా మొదలగు అనేక సమస్యలకు దివ్యౌషధంగా (Divine medicine) సహాయపడతాయి.
Beat root
జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది: బీట్ రూట్ ను తీసుకుంటే జీర్ణప్రక్రియ (Digestion) మెరుగుపడుతుంది. తిన్న ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది. అలాగే మలబద్ధకం (Constipation) వంటి సమస్యలు కూడా తగ్గి మలవిసర్జన సాఫీగా జరుగుతుంది.
Beat root
క్యాన్సర్ కు విరుగుడు సహాయపడుతుంది: బీట్ రూట్ లో యాంటీ క్యాన్సర్ గుణాలు (Anti-cancer properties) పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ కణాల (Cancer cells) వ్యాప్తిని అడ్డుకుంటాయి. క్యాన్సర్ కు విరుగుడు గా సహాయపడి కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తుంది.
Beat root
నొప్పి, వాపులను నుంచి ఉపశమనం లభిస్తుంది: బీట్ రూట్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు (Anti-inflammatory properties) సమృద్ధిగా ఉంటాయి. ఇవి నొప్పి, వాపుల (Pain, swelling) నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. కాబట్టి తరచూ ఏదో ఒక రూపంలో బీట్ రూట్ ను తీసుకోవడం తప్పనిసరి.
Beat root
ఎముకలు దృడంగా మారుతాయి: శారీరకశ్రమ అధికంగా చేసేవారు బీట్ రూట్ రసాన్ని తీసుకోవడం మంచిది. వ్యాయామం (Exercise) చేసేవారు రోజుకు రెండు కప్పుల బీట్ రూట్ రసాన్ని తాగితే శరీరానికి పుష్టి కలిగి ఎముకలు దృఢంగా (Bones Strong) మారుతాయి.
Beat root
గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది: బీట్ రూట్ లో ఉండే పోషకాలు రక్త ప్రసరణ (Blood circulation) సాఫీగా సాగేలా సహాయపడతాయి. అలాగే రక్తపోటును అదుపులో ఉంచుతాయి. గుండె ఆరోగ్యాన్ని (Heart health) మెరుగుపరిచి గుండె సమస్యలు రాకుండా చూస్తాయి.
Beat root
నెలసరి సమస్యలు తగ్గుతాయి: నెలసరి సమయంలో చాలా మంది మహిళలు ఐరన్ తగ్గి బాధపడుతుంటారు. బీట్ రూట్ లో అధిక మొత్తంలో ఐరన్ (Iron) ఉంటుంది. కనుక బీట్ రూట్ ను తీసుకుంటే నెలసరి సమయంలో ఏర్పడే ఐరన్ లోపం (Iron deficiency) తగ్గుతుంది.
Beat root
జుట్టు కుదుళ్లు బలంగా మారుతాయి: బీట్ రూట్ లో ఉండే పొటాషియం (Potassium) జుట్టు కుదుళ్లు (Hair follicles) బలంగా మారడానికి సహాయపడుతుంది. దీంతో జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అలాగే జుట్టు సమస్యలు అన్ని తగ్గి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
Beat root
అలాగే వీటితో పాటు కాళ్ల నొప్పులు (Leg pains), బలహీనత (Weakness) సమస్యలు, ఊబకాయం వంటి ఇతర సమస్యలు తగ్గుతాయి. కనుక బీట్ రూట్ ను జ్యూస్, కూర లేదా హల్వా ఇలా ఏదో ఒక రూపంలో శరీరానికి అందించడం తప్పనిసరి అని ఆహార నిపుణులు చెబుతున్నారు.