భారతదేశంలో ఈ రోగాల వల్లే ఎక్కువగా చనిపోతున్నారు..
ఒకప్పుడు 50 ఏండ్లు నిండిన తర్వాతే రోగాలు వచ్చేవి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా ప్రాణాంతక రోగాలు వస్తున్నాయి. రోగాలతోనే ఎంతో మంది చనిపోతున్నారు. అయితే మనదేశంలో మరణాలకు అత్యంత సాధారణ కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గుండె జబ్బులు
ఒకప్పుడు గుండు జబ్బులు పెద్ద వయసు వారికే వచ్చేవి. ఇప్పుడు స్కూల్ పిల్లలు కూడా దీనిబారిన పడుతున్నారు. డ్యాన్స్ చేస్తూ, వర్కౌట్స్ చేస్తూ, పాటలు పాడుతూ.. ఉన్నపాటుగా గుండెపోటుతో ప్రాణాలు వదిలిన ఘటనలు ఈ మధ్య మనం ప్రతిరోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం.. 2019లో గుండెపోటు 28,005 మందిని బలిగొంది. ఈ ఐదేళ్లలో గుండెపోటు కేసులు 53% పెరిగాయి.
stroke
స్ట్రోక్
భారతదేశంలో మరణాలకు రెండో అత్యంత సాధారణ కారణం స్ట్రోక్. అవును భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 1,85,000 మంది స్ట్రోక్ బారిన పడుతున్నారు. ప్రతి 4 నిమిషానికి దాదాపు ఒక స్ట్రోక్ మరణం సంభవిస్తుందని నివేధికలు వెల్లడిస్తున్నాయి.
శ్వాసకోశ వ్యాధులు
ప్రస్తుత కాలంలో శ్వాసకోస వ్యాధుల సంఖ్య బాగా పెరిగిపోయింది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (RGI) నివేదిక ప్రకారం.. భారతదేశంలో 2020లో శ్వాసకోశ వ్యాధులతో మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. న్యుమోనియా, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధుల కారణంగా దాదాపు 1,81,160 మంది చనిపోయారు.
అతిసార వ్యాధులు
5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న పిల్లల మరణాలకు దారి తీసే ప్రధాన కారణాలలో ఒకటి అతిసారం. భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 1.1 లక్షల మంది అతిసారంతో ప్రాణాలు కోల్పోతున్నారు.
క్షయవ్యాధి
2020లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా కొత్త టీబీ కేసుల్లో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ 7 ఇతర దేశాలతో పాటు భారతదేశం కూడా ఉంది. ఇది ఏటా ఎంతో మందిని బలిగొంటుంది.
cancer
క్యాన్సర్
భారతదేశంలో క్యాన్సర్ కారణంగా 2022లో మరణాల సంఖ్య 8,08,558కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా డిసెంబర్ 2022లో రాజ్యసభలో తెలిపారు. ఈ క్యాన్సర్ ను ప్రారంభదశలో గుర్తిస్తేనే ప్రాణాలతో బయటపడతారు.
రోడ్డు ప్రమాదాలు
భారతదేశంలో ప్రమాదవశాత్తు గాయాలు, యాక్సిడెంట్ ల వల్ల ఏటా 0.15 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంభవించే ప్రమాద సంబంధిత మరణాల్లో మన దేశంలోనే 11 శాతం మంది ఉన్నారు.
Suicdie
ఆత్మహత్యలు
ప్రస్తుత కాలంలో ఆత్మహత్యలు చేసుకునే వారు చాలా ఎక్కువయ్యారు. చిన్న చిన్న విషయాలకు కూడా మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎన్సీఆర్‌బీ నివేదిక ప్రకారం.. 2021లో భారతదేశంలో రోజుకు 450 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.
ముందస్తు జననం
భారతదేశంలో అధిక శిశు మరణాల రేటు (IMR) ఉందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. 1000 మంది పుడితే 28 శిశువులు చనిపోతున్నారు.