రోజంతా ఎనర్జిటిక్ గా ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్ టైంలో ఇలా చేయండి
రోజంతా హైడ్రేటెడ్ గా, ఎనర్జిటిక్ గా ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్ ను అస్సలు మిస్ చేయకూడదు. అయితే కొంతమంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను తినరు. ఇంకొందరు ఉదయాన్నే స్నాక్స్ తింటారు. కానీ ఈ రెండు అలవాట్లు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు.

breakfast
ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను అస్సలు మిస్ చేయకూడదు. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ మనల్ని రోజంతా హైడ్రేటెడ్ గా, ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. కానీ కొంతమంది ఉదయం అస్సలు తినరు. ఇంకొంతమంది ఉదయాన్నే స్నాక్స్ ను తింటుంటారు. మీకు తెలుసా? మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తే కొన్ని గంటల తర్వాత మీకు విపరీతమైన ఆకలి పుడుతుంది. ఇదికాస్త మీరు అతిగా తినడానికి దారితీస్తుంది. దీంతో మీరు ఊబకాయం బారిన పడతారు. మరి ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఖచ్చితంగా తినాల్సినవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
breakfast
పుష్కలంగా వాటర్ తాగండి
ఉదయం లేవగానే మీరు ముందుగా చేయాల్సిన ముఖ్యమైన పని పుష్కలంగా నీటిని తాగడం. నీళ్లు జీర్ణక్రియను మెరుగుపరచడానికి, జీవక్రియను సులభతరం చేయడానికి సహాయపడతాయి. ఉదయం తినడానికి ముందుగా నీటిని తాగితే ఆకలి తగ్గుతుంది. దీంతో మీరు బరువును నియంత్రించుకోవచ్చు. పుష్కలంగా నీటిని తాగడం వల్ల మీ మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇవి చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.
ప్రోటీన్
బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్నే తినడానికి ప్రయత్నించండి. రోజంతా హైడ్రేట్ గా, శక్తివంతంగా ఉండటానికి ప్రోటీన్ ఎక్కువగా ఉండే అల్పాహారం చాలా చాలా అవసరం. అలాగే బరువు తగ్గడానికి ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఆకలిని తగ్గించి హార్మోన్ల స్థాయిని పెంచి శరీరానికి శక్తిని అందిస్తుంది.
breakfast
ఫైబర్
ఉదయం మీరు తినే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని చేర్చండి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు ఆకలిని తగ్గించడానికి సహాయపడతాయి. దీంతో మీరు బరువును నియంత్రించుకోవచ్చు.
చక్కెరను తగ్గించండి
ఉదయాన్నే చక్కెర ఎక్కువగా తీసుకోవడం అంత మంచిది కాదు. ఎక్కువ మొత్తంలో స్వీటెనర్లు శరీరానికి చేరడం వల్ల కడుపులో కొవ్వు పేరుకుపోతుంది. ఇది కేలరీలు పెరగడానికి కూడా కారణమవుతుంది. కాబట్టి తీపి పానీయాలు, తీపి స్నాక్స్ తీసుకోవడం తగ్గించండి.
టీ, కాఫీ
చాలా మందికి ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ ఇవి మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. అందుకే వీటికి బదుదలుగా నిమ్మకాయ, తేనెను కలిపిన గోరువెచ్చని నీటిని తాగండి. ఇది జీవక్రియను సులభతరం చేయడానికి సహాయపడుతుంది. ఇది బెల్లీ ఫ్యాట్ ను కరిగించడానికి కూడా సహాయపడుతుంది. నిమ్మకాయ, తేనె కలిపిన గోరువెచ్చని నీరు జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.