Health Tips: పీరియడ్స్ పెయిన్ తో బాధపడుతున్నారా.. ఈ ఆహారంతో ఉపశమనం పొందండి!
Health Tips: చాలామంది మహిళలు పీరియడ్స్ టైం లో విపరీతమైన కడుపునొప్పి అనుభవిస్తూ ఉంటారు. ఏ పని చేసుకోలేని పరిస్థితి అనుభవిస్తూ ఉంటారు ఆ సమయంలో. అయితే ఈ ఆహారం తీసుకోవడం ద్వారా అలాంటి నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అదేంటో చూద్దాం.

పీరియడ్స్ సమయంలో గర్భాశయ కండరాలు సంకోచానికి గురవడం వల్ల పొత్తికడుపులో నొప్పి కలుగుతుంది. మహిళల్లో పీరియడ్స్ సమయంలో స్త్రీల అండాశయాలలో ప్రోస్టాగ్లాండిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఆ ప్రాంతంలో నొప్పికి కారణం అవుతుంది.
తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడేవారు చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల కాస్త నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. పీరియడ్స్ సమయంలో శరీరం డిహైడ్రేషన్ కి ఎక్కువగా గురవుతుంది. కాబట్టి ఎక్కువ మోతాదులో మంచినీరు తాగాలి.
అలాగే ఆకుకూరలు కూడా ఎక్కువగా ఈ సమయంలో తినాలి. ఇది శరీరానికి శక్తిని ఇవ్వటమే కాకుండా జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. అలాగే పీరియడ్స్ రావడానికి ముందు నుంచి బెల్లం ముక్కని తినటం ప్రారంభించాలి.
దీనివల్ల శరీరం బలాన్ని సంతరించుకుంటుంది. పీరియడ్ టైం లో రక్తస్రావం వల్ల శరీరం బలహీనం పడుతుంది. బెల్లం తినడం వల్ల శరీరానికి కావాల్సిన సోడియం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు అందుతాయి.
బెల్లంలో పొత్తు కడుపు నొప్పిని తగ్గించడానికి సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు,యాంటీ సాస్మోడిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి పొత్తికడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఉపయోగపడతాయి.అలాగే బొప్పాయి పండు తినటం వల్ల కూడా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చును.
బొప్పాయి పండులో ఉండే యాంటీ ఇన్ఫ్లోమేటరీ గుణాలు సంకోచించిన పొత్తికడుపు కండరాలు తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడంలో సహకరిస్తాయి. బొప్పాయిలో కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ సి తో పాటు ఐరన్ అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి బొప్పాయి పండు తినటం వలన పీరియడ్స్ పెయిన్ నుంచి ఉపశమనం లభిస్తుంది.