Health Tips: బలహీనంగా ఉండే మగవారికి అద్భుతమైన ఆహార చిట్కాలు.. ఇంతకు అవేంటంటే?
Health Tips: మగవారు తీవ్రమైన ఒత్తిడితో అనారోగ్యానికి గురవుతున్నారా.. అంటే మీకు పోషకాహార లోపం ఉన్నట్లు అర్థం అందుకే మీలాంటి వాళ్ల కోసమే ఈ ఆహారం. అవేంటో చూసేయండి.

నేటి బిజీ లైఫ్ లో ఒత్తిడితో కూడుకున్న జీవన విధానం వలన మగవాడు అనారోగ్యం పాలవుతున్నాడు. ఒకవైపు కుటుంబ బాధ్యతలు ఒకవైపు ఉద్యోగంలో టార్గెట్లు రీచ్ అవ్వటం కోసం పడే శ్రమ వెరసి మగవాడిని తీవ్రమైన పొద్ధుడికి గురి చేస్తున్నాయి.
పైగా మగవాడు తనమీద తను ఎక్కువగా శ్రద్ధ చూపించుకోలేడు. ఫలితంగా పురస్టేట్ క్యాన్సర్ అధిక కొలెస్ట్రాల్ డయాబెటిస్ మైగ్రేన్ వంటి వ్యాధులకి గురవుతున్నారు అలా కాకూడదంటే కార్బోహైడ్రేట్లు ఖనిజాలు ఉండే ఆహారాన్ని రోజు తినేలా ప్లాన్ చేసుకోవాలి.
తనని తాను స్ట్రాంగ్ గా ఫిట్ గా ఉంచుకోవాలంటే కొన్ని రకాల ఆహారాలను తన డైట్ లో చేర్చుకోవాలి. అవేంటో చూద్దాం. ముందుగా గుడ్డు సంగతి చూద్దాం ఎందుకంటే ఇవి పోషకాలతో నిండి ఉంటాయి. పైగా ఇందులో క్యాల్షియం,ఆరోగ్యకరమైన కొవ్వు, కేలరీలు, సోడియం, పొటాషియం వంటివి చాలా ఎక్కువ మోతాదులో లభిస్తాయి.
అలాగే ఇందులో విటమిన్ b6 మెగ్నీషియం, విటమిన్ డి తో కూడిన ఆహార పదార్ధం. అందుకే కచ్చితంగా ప్రతిరోజు గుడ్డుని తీసుకోండి. అలాగే గ్రీన్ వెజిటబుల్స్ ఇందులో పోషకాలు ఖనిజాలు, అధికంగా ఉంటాయి ఇవి శరీరాన్ని ఆరోగ్యంగానూ, నీరసరహితంగానూ ఉంచడానికి సహాయపడతాయి.
ఇక పాల విషయానికి వస్తే ఇందులో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఇది ఎముకల అభివృద్ధికి ఉత్తమమైన ఆహారం. రోజు పాలు తాగడం వలన గుండె ఆరోగ్యంగా ఉండటంతో పాటు సమస్యకు దూరంగా ఉంచుతుంది. కండరాలని బలంగా తయారు చేయడానికి పాలు ఉత్తమంగా పనిచేస్తాయి.
అలాగే ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ పుష్కలంగా ఉండే ఆహారం కొవ్వు చేపలు. వీటిని మగవారు తప్పనిసరిగా తన ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి. ఇందులో ఉండే ప్రోటీన్లు కొత్త కణాల ఏర్పాటుకు సహకరిస్తాయి. అంతేకాకుండా క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. అలాగే స్ప్రౌట్స్, డ్రై ఫ్రూట్స్ కూడా ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన శరీరం స్ట్రాంగ్ గా ఉంటుంది.