- Home
- Life
- Health
- Health Tips: పొద్దున్నే లేవటం ఇష్టం లేదా.. అయితే ఈ అమేజింగ్ బెనిఫిట్స్ మిస్ అవుతున్నట్లే!
Health Tips: పొద్దున్నే లేవటం ఇష్టం లేదా.. అయితే ఈ అమేజింగ్ బెనిఫిట్స్ మిస్ అవుతున్నట్లే!
Health Tips: మనలో చాలామంది పొద్దున్న లేవటానికి ఇష్టపడరు కానీ వేకువ జామునే లేవటం వలన వచ్చే అమేజింగ్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుంటే బద్ధకించడానికి అస్సలు ఇష్టపడరు. ఆ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

నేటి ఆధునిక జీవనశైలిలో ఎవరూ పొద్దున్న లేవటానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే వాళ్లు పడుకోవటమే రాత్రి 11, 12 గంటలకి పడుకుంటున్నారు. పొద్దున్న 9, 10 అయితేనే గాని నిద్ర లేవటానికి ఇష్టపడటం లేదు. అయితే వేగువ జామునే లేవటం వలన కలిగే బెనిఫిట్స్ గురించి తెలుసుకుంటే అసలు లేవటానికి ఆలస్యం చేయరు.
వేకువ జామునే నిద్ర లేవటం వలన శరీరం చాలా చురుకుగా పని చేస్తుంది. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో అందరూ బ్రేక్ ఫాస్ట్ ని ఎస్కప్ చేస్తున్నారు కానీ హెల్తీ బాడీకి బ్రేక్ ఫాస్ట్ ఖచ్చితంగా ఉండాలి ఎర్లీ మార్నింగ్ లేచినవారికి అల్పాహారం తీసుకోవడానికి టైం మిగులుతుంది.
కాబట్టి కచ్చితంగా అల్పాహారం తీసుకుంటారు. అలాగే శరీరానికి వ్యాయామం ఎంతో అవసరం. లేటుగా లేచేవారు టైం లేదంటూ ఆఫీసులకు కాలేజీలకు పరిగెడుతూ ఉంటారు. వేకువజామునే లేచే వాళ్ళకి ఆ ఇబ్బంది ఉండదు.
ఎందుకంటే వాళ్ళు ప్లానింగ్ ప్రకారం వ్యాయామం చేస్తారు కాబట్టి ఈరోజు అంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. నిద్రలేవటం వల్ల మానసిక ప్రయోజనాలు ప్రోడక్టివిటీ మెరుగుపడుతుంది. ఉదయం సమయంలో మెదడు చాలా ప్రశాంతంగా యాక్టివ్ గా ఉంటుంది.
అలాంటి సమయంలో మంచి నిర్ణయం తీసుకోవడానికి దోహదపడుతుంది. అలాగే వేకువ జామునే లేచి చదువుకోవటం వలన అది త్వరగా మన మైండ్ లోకి ఎక్కుతుంది. ఎందుకంటే ఉదయం పూట మైండ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. వేకువజామునే లేచే అలవాటు ఉన్న వాళ్ళకి త్వరగా పడుకొని అలవాటు ఉంటుంది.
త్వరగా పడుకోవడం వలన అలసిపోయిన శరీరం ఫ్రెష్ అవ్వటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మరుసటి రోజు మళ్ళీ వేకువ జామునే లేవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వేకువజామున లేవటానికి ప్రయత్నించండి లేకపోతే పైన చెప్పిన బెనిఫిట్స్ అన్ని మీరు మిస్ అయినట్టే.