శంఖుపూల మొక్కతో ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు?
శంఖుపూల మొక్కలో (Coniferous plant) అద్భుతమైన ఔషధ గుణాలు (Medicinal properties) ఉంటాయి. శంఖు మొక్క పువ్వులు, ఆకులు, కాండము, గింజలు ఇలా ఈ మొక్కలోని అన్ని భాగాలు ఆరోగ్యానికి మంచి ఔషధంగా సహాయపడతాయి.

ఈ మొక్కను ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు. శంఖుపూలతో టీ ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా శంఖుపూల మొక్కతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
ఈ మొక్కలు ఫ్లేవనాయిడ్లు (Flavonoids), యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants), కాల్షియం, మెగ్నీషియం, సోడియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అందుకే ఈ పూలను మరిగించి చల్లార్చిన నీటిలో నిమ్మరసం పిండి కొంచెం తేనె కలుపుకొని తాగితే ఆరోగ్యానికి మంచిది.
ఈ పూల కషాయాన్ని తాగితే నెలసరి ఇబ్బందులు తగ్గిపోతాయి. విష పదార్థాలకు విరుగుడుగా (Antidote) వేళ్ళతో చేసిన మందులను పూర్వం రోజుల్లో ఇచ్చేవారట. సోరియాసిస్ (Psoriasis) వంటి చర్మ సమస్యలు తగ్గించే సామర్థ్యం కూడా ఈ మొక్కకు ఉంది. ఈ మొక్కతో కలిగే మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..
జీర్ణశక్తికి మంచిది: వారంలో రెండుసార్లు పరగడుపున శంఖుపూలను మరిగించి కషాయం తాగితే శరీరంలోని టాక్సిన్లన్ని తొలగిపోయి జీర్ణవ్యవస్థ (Digestive system) మెరుగుపడుతుంది. మలబద్ధకం (Constipation), వాంతులు, వికారం వంటి సమస్యలు తగ్గిపోతాయి.
జ్ఞాపకశక్తిని పెరుగుతుంది: ఈ పూలలో ఉండే ఆర్గనెల్లోలీన్ (Organelloline) అనే పదార్థం శరీరంలో ఎసిటైల్ కొలిన్ అనే న్యూరోట్రాన్స్ మీటర్ శాతాన్ని పెంచి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. దీంతో మతిమరుపు సమస్యలు తగ్గి జ్ఞాపక శక్తి (Memory) పెరుగుతుంది. నిద్రలేమి సమస్యలు కూడా తగ్గుతాయి.
క్యాన్సర్ ను నివారిస్తుంది: ఈ పువ్వుల టీలోని సైక్లోటైడ్లు (Cyclotides) శరీరంలోని క్యాన్సర్ కణాల వ్యాప్తిని అడ్డుకుంటాయి. ఫలితంగా ఊపిరితిత్తుల కేన్సర్ (Cancer) రాకుండా నివారణగా సహాయపడుతాయి.
చర్మసౌందర్యాన్ని పెంచుతుంది: ఇందులో ఉండే పోషకాలు కొల్లాజెన్ (Collagen) ఉత్పత్తిని పెంచి మొటిమలు, మచ్చలు, ముడతలను తగ్గించి చర్మసౌందర్యాన్ని పెంచుతుంది. ఇందులో క్యుయెర్సిటిన్ అనే ఫ్లేవనాయిడ్స్ (Flavonoids) ఉంటాయి. ఇవి జుట్టు సౌందర్యానికి సహాయపడతాయి.
బరువును తగ్గిస్తుంది: ఈ పూల కషాయాన్ని లేదా టీని తాగితే ఆకలి నియంత్రణలో (Appetite control) ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ (Cholesterol) శాతాన్ని తగ్గించి బరువును తగ్గిస్తుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ శాతాన్ని పెంచుతుంది.
దగ్గు, జలుబులను తగ్గిస్తుంది: ఈ మొక్క పూలతో తయారు చేసిన టీని (Tea) తాగితే ఇన్ఫెక్షన్ (Infection) కారణంగా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా కాపాడుతుంది.
కంటి చూపును పెంచుతుంది: ఈ మొక్క పువ్వులో ప్రోయాంథోసైనిడిన్ (Proanthocyanidin) అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి నరాల్లో రక్తసరఫరా మెరుగుపరచి కంటి ఇన్ఫెక్షన్లను (Eye infection) తగ్గించి కంటి చూపును పెంచుతాయి. కనుక ఈ పూల టీని సేవించడం మంచిది.