ఎండాకాలంలో గర్భిణులు కుంకుమ పువ్వును తినొచ్చా?
ఎన్నో ఔషదగుణాలున్న కుంకుమ పువ్వును ఏండ్ల నుంచి ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. ఇది ఎన్నో రోగాలను తగ్గించడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
కుంకుమ పువ్వు ప్రపంచంలో అత్యంత ఖరీదైన మసాలా దినుసులలో ఒకటి. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న కుంకుమపువ్వును ఏండ్ల నుంచి ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అందాన్ని రెట్టింపు చేయడానికి కూడా ఇద అద్బుతంగా పనిచేస్తుంది. దీని రంగు, వాసన దీనిని ఇతర మసాలా దినుసుల కంటే భిన్నంగా చేస్తుంది.
కుంకుమపువ్వును ప్రధానంగా ఆసియా, ఐరోపాలో పండిస్తారు. ఇది సాధారణంగా మంచు ప్రాంతాలలో పండుతుంది. కుంకుమపువ్వు క్రోకస్ అని పిలువబడే క్రోకస్ స్టివస్ పువ్వుల నుంచి లభిస్తుంది. దీనిని డెజర్ట్లకు రుచి, రంగును జోడించడానికి సాధారణంగా దీనిని ఉపయోగిస్తారు. దాని సువాసన కూడా అద్భుతంగా ఉంటుంది. కుంకుమ పువ్వు తో ఎలాంటి లాభాలు కలుగుతాయంటే..?
<p>saffron</p>
లిబిడో బూస్టర్
మషాద్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్స్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. కుంకుమపువ్వులోని క్రోసిన్ సమ్మేళనాలు పురుషులలో లైంగిక శక్తిని, లిబిడోను పెంచడానికి సహాయపడతాయి.
మానసిక స్థితి మెరుగుపడుతుంది
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. కుంకుమపువ్వు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇది మీ మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది.
saffron
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. కుంకుమ పువ్వు రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది డయాబెటిస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.
Saffron
గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి
పబ్ మెడ్ సెంట్రల్ ప్రకారం.. కుంకుమపువ్వులో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. దీనివల్ల రక్తనాళాలు, ధమనుల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
జ్ఞాపకశక్తిని పెంచుతుంది
కుంకుమపువ్వు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల అల్జీమర్స్ సమస్య తగ్గిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జ్ఞాపకశక్తిని పెంచి డిమెన్షియా, అల్జీమర్స్ వంటి జ్ఞాపకశక్తికి సంబంధించిన అన్ని సమస్యలు తగ్గిపోతాయి.
కుంకుమపువ్వును చాలాకాలంగా ఆయుర్వేద ఉత్పత్తులలో ఉపయోగిస్తున్నారు. కుంకుమపువ్వులో ఉండే యాంటీఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. కుంకుమపువ్వు నూనెను కూడా జుట్టుకు ఉపయోగించొచ్చు. ఇది మీ జుట్టును పొడవుగా, మెరిసేలా, ఆరోగ్యంగా చేస్తుంది.
ఎండాకాలంలో కుంకుమపువ్వును తినడం సురక్షితమేనా?
కుంకుమ పువ్వులో వేడి చేసే గుణం ఉంటుంది. అయితే దీన్ని మీ సమ్మర్ డైట్ లో చేర్చుకోలేమని కాదు. ఎండాకాలంలో వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదు. కుంకుమపువ్వు ముఖ్యమైన పోషకాలకు అద్భుతమైన మూలం. అందుకే వీటిని ఎండాకలంలో కూడా ఎంచక్కా తీసుకోవచ్చు.
మరి వీటిని డైట్ లో ఎలా చేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎండాకాలంలో వీటిని శీతలీకరణ, రిఫ్రెష్ పానీయాలలో చేర్చొచ్చు. స్మూతీలు, జ్యూసులు, ఇతర ఆరోగ్యకరమైన పానీయాలలో 2 నుంచి 3 కుంకుమపువ్వులను మిక్స్ చేసి తీసుకోండి.
వీటిని మీ సలాడ్ లలో కూడా చేర్చొచ్చు. మీకు ఇష్టమైన పండ్లు, కూరగాయల సలాడ్లను కుంకుమపువ్వుతో గార్నిష్ చేసి తీసుకోండి.
మీ రోజువారీ అన్నాన్ని మరింత రుచికరంగా చేయడానికి కొన్ని కుంకుమపువ్వు పువ్వులను ఉపయోగించొచ్చు. ఇది కాకుండా కొత్తిమీర, పుదీనా చట్నీని తయారు చేస్తుంటే అందులో కూడా చేర్చుకోండి.