MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే మీ వంటింట్లో ఉండే వీటిని ఖచ్చితంగా తినండి

మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే మీ వంటింట్లో ఉండే వీటిని ఖచ్చితంగా తినండి

అధిక రక్తపోటు, డయాబెటీస్ వంటి వ్యాధులు కొన్ని సార్లు మూత్రపిండాల పనితీరును కూడా ప్రభావితం చేస్తాయి. మూత్రపిండాలు దెబ్బతినేలా చేస్తాయి. అయితే ప్రతి వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలు మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 02 2023, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
kidney health

kidney health

మన శరీరంలోని మలినాలను మూత్రపిండాలే బయటకు పంపుతాయి. ఇవి దెబ్బతింటే మన శరీరంలో వ్యర్థపదార్థాలు పేరుకుపోయి ఎన్నో రోగాలు వస్తాయి. అయితే మన మూత్రపిండాలు ఎన్నో కారణాల వల్ల దెబ్బతింటాయి. అంతేకాదు పెయిన్ కిల్లర్స్ ను ఎక్కువగా వాడినా కూడా మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటుంది. డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి వ్యాధులు కొన్నిసార్లు మూత్రపిండాల పనితీరును కూడా ప్రభావితం చేస్తాయి. మూత్రం లేదా మూత్రపిండాలలో రాళ్లు మూత్రపిండాల పనితీరును కూడా ప్రభావితం చేస్తాయి. మూత్రపిండాల వ్యాధులను సమర్థవంతంగా నియంత్రించడానికి ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

27

పసుపు

పసుపులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. పసుపుకు కర్కుమిన్ అనే రసాయనమే రంగును ఇస్తుంది. ఇది మనం ఎన్నో వ్యాధుల నుంచి బయటపడటానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పసుపును డైట్ లో చేర్చుకోవడం వల్ల కిడ్నీల ఆరోగ్యం కూడా బాగుంటుంది. పసుపు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా సహాయపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. 
 

37
Image: Getty Images

Image: Getty Images

అల్లం

అల్లం దగ్గు, జలుబు, వైరల్ జ్వరం నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే అల్లం మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. 
 

47
garlic

garlic

వెల్లుల్లి

వెల్లుల్లిలో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. వెల్లుల్లి అధిక రక్తపోటును తగ్గిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపర్చడంతో పాటుగా వెల్లుల్లి మూత్రపిండాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

57
onion

onion

ఉల్లిగడ్డ

ఉల్లిగడ్డలో ఎన్నో రోగాలను తగ్గించే సామర్థ్యం ఉంటుంది. ఉల్లిపాయ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అందుకే ఉల్లిపాయను ప్రతి కూరలో వేసుకుని తినండి. ఉల్లి మీ మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

67

రెడ్ క్యాప్సికం

రెడ్ క్యాప్సికమ్ లో పొటాషియం చాలా తక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా మంచిది. రెడ్ క్యాప్సికమ్ లో విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ ఎ, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మూత్రపిండాల ఆరోగ్యాన్ని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి.
 

77

ఆలివ్ ఆయిల్

మూత్రపిండా వ్యాధితో బాధపడేవారు ఆలివ్ ఆయిల్ ను వాడితే మంచిది. ఎందుకంటే ఆలివ్ ఆయిల్ లో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. మూత్రపిండాల ఆరోగ్యాన్ని రక్షించడంలో కూడా ఇవి ఎంతగానో సహాయపడతాయి.
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
AC : ఎండలోంచి నేరుగా ఏసీ రూమ్‌ లోకి వెళ్తున్నారా..? ఆ చల్లదనం ఎంత డేంజరో తెలుసా..?
Recommended image2
Thyroid Cancer: ఇవి తెలుసుకుంటే థైరాయిడ్ క్యాన్సర్‍కు చెక్ పెట్టొచ్చు
Recommended image3
Health : ఆల్కహాల్ అలవాటే లేకున్నా లివర్ డ్యామేజ్ అవుతుందా..! ఈ ఐదు విషయాలే కారణం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved