లివర్ సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..?
మన శరీర భాగంలో గుండె తర్వాత అతి ముఖ్యమైనది లివర్ (Liver). ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించడానికి ముఖ్యంగా పనిచేస్తుంది. ఈ ఆర్టికల్ ద్వారా లివర్ సమస్యలని (Liver problems) ఎలా గుర్తించడం, తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి తెలుసుకోవడం.

లివర్ సమస్యలు అందరిలోనూ వచ్చే సర్వసాధారణ సమస్య. జీర్ణ వ్యవస్థకు (Digestive system) ముఖ్యమైన లివర్ కు ఏదైనా అనారోగ్య సమస్య (Health problems) వస్తే మొత్తం శరీర వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఇది రక్తంలోని చెడు చేసే పదార్థాలను తొలగించి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.
మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి అనేక పనులకు లివర్ ఉపయోగపడుతుంది. అయితే లివర్ చేసే ముఖ్యమైన పని శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడం. కలుషిత నీరు, అధిక బరువు (Over weight), ఊబకాయం, మధుమేహం, శరీరంలోని అధిక కొలెస్ట్రాల్, మద్యపానం, ధూమపానం (Smoking) వంటి తదితర కారణాల ద్వారా లివర్ పనితీరు దెబ్బతింటుంది.
మారుతున్న జీవనశైలి, ఇతర కారణాలతో ప్రపంచ వ్యాప్తంగా లివర్ సమస్యలతో రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతుంది. అందుకే మన జీవన శైలిలో ఆరోగ్యకరమైన (Healthy) అలవాట్లను, సరైన ఆహార పద్ధతులను అలవాటు చేసుకోవాలి. ప్రతి రోజూ వాకింగ్ చేయడం, కండరాలను బలోపేతం చేసే వ్యాయామం (Exercise) చేయడం ద్వారా ప్రాణాంతక లివర్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.
అయితే లివర్ సమస్యలు (Liver problems) ఉన్నప్పుడు ముఖ్యంగా మన శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అలసటగా ఉంటుంది. ఏ పని చేయకపోయినా అలసటగా ఉంటుంది. వికారం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. తిన్న ఆహారం జీర్ణం (Digestion) అయినప్పుడే మనకి ఆకలి వేస్తుంది. అలాంటప్పుడు జీర్ణక్రియ సరిగా పనిచేయకపోతే మనకు ఆకలి కాదు.
జాండీస్ సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే లివర్ సమస్యలు వస్తుంటాయి. కళ్ళు పచ్చగా మారుతాయి. దీంతో వికారం కడుపు నొప్పి వాంతులు వంటి సమస్యలు మనల్ని ఇబ్బంది పెడతాయి. మీరు వెంటనే డాక్టర్ ను కలిసి తగిన చికిత్స తీసుకోవడం అవసరం. లివర్ సమస్య రాకుండా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది. బీట్ రూట్ (Beetroot), క్యారెట్ (Carrot) లో లివర్ ను శుద్ధి చేసే ఔషధ గుణాలు ఉంటాయి. పసుపు, అల్లంను ఎక్కువగా వాడాలి. లివర్ లోని విషపదార్థాలను శుద్ధి చేస్తాయి.
ఇవి లివర్ పనితీరుని మెరుగుపరుస్తాయి. లివర్ లోని విష పదార్థాలను తొలగించడానికి పాలకూర బాగా పనిచేస్తుంది. విటమిన్ సి (Vitamin C) అధికంగా ఉండే నిమ్మకాయ, నారింజ పండ్లు తీసుకోవడం అవసరం. అలాగే ఎక్కువగా ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లును తగ్గించుకోవాలి. చక్కెర (Sugar) పదార్థాలను ఎక్కువగా తీసుకోరాదు. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ ను పెంచి లివర్ పనితీరును దెబ్బతీస్తుంది. అలాగే ఉప్పు కూడా ఎక్కువగా వాడరాదు.