మీ ఫ్రిజ్ ఆరోగ్యంగానే ఉందా? ఎలా తెలుసుకోవాలంటే..
First Published Dec 18, 2020, 12:23 PM IST
ఇప్పుడు ప్రతీ ఇంట్లోనూ ఫ్రిజ్ కామన్.. ఆహారపదార్థాలు పాడవకుండా ఉండడానికి, ఎక్కువ కాలం తాజాగా ఉండడానికి ఫ్రిజ్ వాడుతుంటారు. అంతేకాదు ఫ్రిజ్ లో చాలా తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి అక్కడ సూక్ష్మజీవులు పెరగవని కూడా అనుకుంటారు. అయితే చల్లటి వాతావరణంలో పెరిగే సాల్మొనెల్లా అనే ఓ సూక్ష్మజీవి ఫ్రిజ్ లో పెరిగే అవకాశం ఎక్కువ.

ఇంకా ముఖ్యంగా మాంసాహారాన్ని ఫ్రిజ్ లో నిల్వ చేసేటప్పుడు ఈ సూక్ష్మజీవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక ఆహారపదార్థంలో సాల్మొనెల్లా ఉందంటే అది ఫ్రిజ్‌లోని అన్ని రకాల ఆహారపదార్థాలనూ కలుషితం చేసే అవకాశం ఉంది. దీనివల్ల ఫ్రిజ్ లోంచి తీసిన ఆహారపదార్థాలను బాగా వేడిచేయకుండా తిన్నప్పుడు కొందరిలో నీళ్ల విరేచనాలతో పాటు డీ–హైడ్రేషన్ ప్రమాదం ఉంటుంది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?