మిగిలిన నూనెను వాడితే ఏమౌతుందో తెలుసా?
డీప్ ఫ్రై చేసిన నూనెను అసలు తిరిగి వాడనే కూడదు. కానీ చాలా మంది ఆడవారు మిగిలిన నూనెను పారేయడానికి బదులుగా అలాగే వాడేస్తుంటారు. కానీ ఇలా మిగిలిన నూనెను వాడితే ఏమౌతుందో తెలుసా?
చాలా మంది పూరీలు, మురుకులు, చికెన్ డీప్ ఫ్రై, సమోసాలు చేసిన నూనెను తిరిగి వాడుతుంటారు. కానీ ఇలా వాడిన నూనెను తిరిగి ఉపయోగించకూడదు. ఎందుకంటే దీనివల్ల మీ ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. మిగిలిపోయిన నూనెను తిరిగి పదేపదే ఉపయోగించడం వల్ల వచ్చే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఆరోగ్యంపై చెడు ప్రభావం
ఒకసారి ఉపయోగించిన నూనెను తిరిగి ఉపయోగించడం నిషిద్దం. కానీ చాలా మంది ఆడవారు ఒకసారి ఉపయోగించిన నూనెను తిరిగి పదే పదే ఉపయోగిస్తూనే ఉంటారు. ఇలా నూనెను వాడితే మాత్రం మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పెరిగిన ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్
మిగిలిన నూనెను మళ్లీ వేడి చేసి వాడితే అది నెమ్మదిగా క్షీణించడం ప్రారంభిస్తుంది. అలాగే ఈ నూనెలో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ పరిమాణం కూడా పెరగడం మొదలవుతుంది. దీనివల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి.
క్యాన్సర్ ప్రమాదం
ఒకసారి వాడిన నూనెను మళ్లీ వేడి చేసినప్పుడు వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తొలగిపోతాయి. ఇలాంటి పరిస్థితిలో క్యాన్సర్ బ్యాక్టీరియా ఆహారానికి అంటుకోవడం ప్రారంభిస్తుంది. దీని వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
గుండెపై చెడు ప్రభావాలు
మిగిలిన నూనెను మళ్లీ మళ్లీ వేడి చేసి వాడటం వల్ల గుండెపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. మిగిలిన నూనెను పదేపదే వాడటం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుుతంది. ఇది మీకు గుండె సంబంధిత సమస్యలను కలిగిస్తుంది.
ఊబకాయం పెరిగే ప్రమాదం
నూనెను తిరిగి వేడి చేయడం, వండుకుని తినడం వల్ల ప్రాణాంతక రోగాలు వస్తాయి. వీటిలో ఒకటి ఊబకాయం సమస్య. అందుకే వాడేసిన నూనెను ఉపయోగించకూడదు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు నూనెను ఒకసారి మాత్రమే వాడాలి.
ఉదర సమస్యలు
వాడేసిన నూనెను మళ్లీ మళ్లీ ఉపయోగిస్తే మీకు ఉదర సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. వంటకు ఉపయోగించే నూనెను తిరిగి వాడటం వల్ల అసిడిటీ, అజీర్ణం వంటి కడుపు సమస్యలు వస్తాయి.
కొవ్వు ఆహారానికి అంటుకుంటుంది
నూనెను తిరిగి ఉపయోగించడం వల్ల అది పాన్ అడుగు భాగానికి అంటుకోవడం మొదలవుతుంది. ఇది ఆహారానికి అంటుకుని మన కడుపులోకి వెళుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే మిగిలిపోయిన నూనెను పొరపాటున కూడా వాడకండి.