Health Tips: రాత్రిపూట భోజనం చేయటం ఎంతవరకు మంచిది.. అసలు వాస్తవాలు ఏంటో తెలుసుకోండి?
Health Tips: చాలామంది ఆరోగ్యం కోసం అంటూ రాత్రులు భోజనం మానేసి చపాతీలు తింటున్నారు. దీనివలన చాలామందికి ఒక అనుమానం వస్తుంది. రాత్రిపూట అన్నం తినటం మంచిదా.. మంచిది కాదా అని.ఇప్పుడు దాని గురించిన వాస్తవాలు తెలుసుకుందాం.

మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తగినన్ని పోషకాలు ఉండాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. అయితే బియ్యంలో కూడా చాలా పోషకాలు ఉంటాయి. దాంతోపాటు అన్నం ప్రిపేర్ చేయటం కూడా చాలా సులువు కాబట్టి చాలామంది అన్నం తినటాన్నే ఇష్టపడతారు.
అన్నంలో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటితోపాటు ప్రోటీన్, కొవ్వు, క్యాల్షియం కూడా ఉంటాయి. అయితే రాత్రిపూట అన్నం తినటం మంచిదేనా అన్నా ప్రశ్న తలెత్తినప్పుడు మంచిది కాదనే అభిప్రాయం వెలువడుతుంది.
అన్నం కడుపుకి చాలా మేలు చేస్తుంది. ఉడకబెట్టిన అన్నం సులభంగా జీర్నమవుతుంది. దీనితోపాటు కడుపు నొప్పి అజీర్ణం, మలబద్ధకం లాంటి సమస్యలని దూరం చేసుకోవచ్చు. అయితే రాత్రిపూట అన్నం తినటం వల్ల డయాబెటిస్ పెరిగే అవకాశం ఉంటుంది.
రాత్రిపూట అన్నం తినే వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. మధుమేహ బాధితులుగా మారకూడదు అనుకుంటే రాత్రిపూట అన్నం తినకూడదు. రాత్రి ఆలస్యంగా అన్నం తిన్నా కూడా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
అలాగే రాత్రిపూట అన్నం తినటం వల్ల జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. అన్నంలో కార్బోహైడ్రేట్లో ఎక్కువగా ఉండటం వల్ల ఆహారాన్ని రాత్రిపూట తీసుకోవడంతో ఊబకాయం సమస్య పెరుగుతుంది. రాత్రిపూట మనం తీసుకున్న ఆహారం జీర్ణం కాక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆస్తమాతో ఉన్నవారు ఎట్టి పరిస్థితులలోనూ రాత్రిపూట అన్నం తినకూడదు.
అలాగే రాత్రిపూట అన్నం తిన్న తర్వాత వెంటనే నిద్రపోవటం వలన శ్వాస కోస వ్యవస్థ పై ఆ ప్రభావం పడుతుంది. ఫలితంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. రాత్రిపూట అన్నం తినటం వల్ల శరీరంలో అదనంగా కార్బోహైడ్రేట్లు పెరగటం వల్ల కొవ్వు పేరుకుపోయి ఎముకలు బలహీనంగా మారుతాయి. అందుకే బరువు తగ్గాలి అనుకున్నా, డయాబెటిస్ నియంత్రణలో ఉండాలి అనుకున్నా రాత్రిపూట అన్నం తినటం మంచిది కాదు.