శరీరంలో హీమోగ్లోబిన్ మోతాదును పెంచే ఆహార పదార్థాలు ఇవే!
శరీరంలో హిమోగ్లోబిన్ (Hemoglobin) మోతాదు తగ్గినప్పుడు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

దేశంలో సగానికిపైగా మహిళలు, పురుషులు, పిల్లలు ఐరన్ లోపంతో (Iron deficiency) బాధపడుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి గల కారణం హిమోగ్లోబిన్ తగ్గడం, ఎనీమియా మొదలైనవి. కనుక ఐరన్ లభించే పోషక పదార్థాలను తీసుకుంటే హిమోగ్లోబిన్ పెరగడంతో పాటు ఆరోగ్యంగా ఉండవచ్చు. మరి ఇప్పుడు మనం హిమోగ్లోబిన్ మోతాదును పెంచే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం..
శరీరంలోని రక్తం ఎర్రగా ఉండడానికి కారణం హిమోగ్లోబిన్ అనే పదార్థం. రక్తంలో ఉండే ఆక్సిజన్ (Oxygen) ను గ్రహించి శరీరంలోని ఇతర భాగాలకు చేరవేయడంలో హిమోగ్లోబిన్ సహాయపడుతుంది. శరీరంలో హిమోగ్లోబిన్ లోపించినప్పుడు నీరసం, ఆకలి లేకపోవడం, నిద్రలేమి, మలబద్ధకం, వాంతి వచ్చినట్లు ఉండటం వంటి లక్షణాలు (Features) కనిపిస్తాయి.
ప్రస్తుత కాలంలో రక్తహీనత (Anemia) సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఈ సమస్యను అశ్రద్ధ చేయకూడదు. ఈ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ఆహార జీవనశైలి పట్ల ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి. తీసుకునే ఆహారంలో మాంసకృత్తుల (Proteins) తోపాటు ఐరన్ సమృద్ధిగా లభించే పదార్థాలు ఉంటే హిమోగ్లోబిన్ మోతాదు పెరుగుతుంది.
బెల్లం: బెల్లంలో (Jaggery) ఐరన్, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి అరుగుదలకు సహాయపటమే కాక రుతుక్రమంలో వచ్చే నొప్పిని (Menstrual pain) దూరం చేస్తాయి. బెల్లంలో ఉండే ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది.
కొర్రలు: కొర్రలలో (Korralu) ఐరన్, క్యాల్షియం, ప్రొటీన్లతో పాటు ఎ, బి, సి విటమిన్లు (Vitamins) సమృద్ధిగా ఉంటాయి. కనుక కొర్రెలను కిచిడి, లడ్డు ఇలా ఏదో ఒక రూపంలో తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. దీంతో రక్తహీనత సమస్య దూరమవుతుంది.
ఆకుకూరలు: ఆకుకూరలలో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని తీసుకుంటే శరీరానికి కావలసిన ఐరన్, క్యాల్షియం పుష్కలంగా లభిస్తాయి. తోటకూర, పాలకూర (Lettuce), గోంగూర (Gongura) వంటి ఆకుకూరలను తీసుకునే ఆహారంలో భాగంగా చేసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.
విటమిన్ సి: నిమ్మ జాతి ఫలాలన్నింటిలోనూ విటమిన్ సి (Vitamin C) సమృద్ధిగా ఉంటుంది. ఐరన్ ను శోషించుకుని శరీరానికి అందించడంలో విటమిన్ సి ప్రధాన పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా చర్మ నిగారింపును (Skin exfoliation), మచ్చలను దూరం చేయడంలోనూ సహాయపడుతుంది.
నువ్వులు: నువ్వులలో (Sesame) హిమోగ్లోబిన్ స్థాయిలు పుష్కలంగా ఉంటాయి. కనుక వీటిని తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు ఊహించని విధంగా పెరుగుతాయి. కనుక రోజుకు ఒక టీ స్పూన్ నువ్వులను తీసుకుంటే రక్తం (Blood) సమృద్ధిగా తయారవుతుంది.
గింజలు: రక్తహీనత సమస్యలు దూరం చేయడానికి గింజలు (Nuts) సహాయపడతాయి. పప్పులు, నల్ల శనగలు, ఉలవలు, అలసందలు, సోయాబీన్స్ (Soybeans), చిక్కుళ్ళు ఇలా మొదలైన గింజలను తీసుకుంటే రక్తహీనత సమస్యలు తగ్గుతాయి. హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.
వీటితోపాటు యాపిల్, ఖర్జూరం (Dates), బీట్ రూట్ (Beat root) వంటి పదార్థాలు రక్తంలో హీమోగ్లోబిన్ మోతాదు పెరగడానికి దోహదపడతాయి. దీంతో శరీరానికి కావలసిన రక్తం సమృద్దిగా లభిస్తుంది.