మిగిలిపోయిన ఇడ్లీలతో మసాలా ఉప్మా.. ఇలా చేస్తే ఎంత రుచిగా ఉంటుందో తెలుసా?
ఉప్మా తినాలనిపిస్తే మనం ఇంటిలో అందుబాటులో ఉండే బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ లేదా సేమియాతో చక చకా చేసేస్తాం.

అయితే ఇలా తరచూ చేసుకునే ఉప్మాలకు బదులుగా కాస్త వెరైటీగా ఈసారి మిగిలిపోయిన ఇడ్లీలతో ఉప్మా రుచుల్ని వండితే సరే. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం ఇడ్లీ మసాలా ఉప్మా (Idli masala upma) తయారీ విధానం (Method of preparation) గురించి తెలుసుకుందాం..
ఈ ఉప్మాను బ్రేక్ ఫాస్ట్ (Breakfast) గాను, సాయంత్రం పూట స్నాక్స్ (Snacks) రూపంలోనూ తినవచ్చు. ఇలా మిగిలిపోయిన ఇడ్లీలతో తయారు చేసుకునే ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఉప్మా తయారీ విధానం కూడా సులభం. ఇలా తయారు చేసుకున్న మసాలా ఉప్మాను తినడానికి ఇంటిల్లపాది ఇష్టపడతారు.
కావలసిన పదార్థాలు: పది ఇడ్లీలు (Idlies), రెండు ఉల్లిపాయలు (Onions), రెండు టమోటాలు (Tomatoes), రెండు పచ్చిమిరపకాయలు (Chilies), సగం స్పూన్ అల్లం (Ginger) తరుగు, కొత్తిమీర (Coriyander) తరుగు, కరివేపాకు (Curries) రెబ్బలు, ఒక స్పూన్ కారం (Chilly powder).
ఒకటి క్యాప్సికం (Capsicum), ఒకటి క్యారెట్ (Carrot), ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పొడి (Sambar powder), ఒక స్పూన్ ఆవాలు (Mustard), ఒక స్పూన్ సెనగపప్పు (Senagapappu), ఒక టేబుల్ స్పూన్ నూనె (Oil), రుచికి సరిపడా ఉప్పు (Salt).
తయారీ విధానం: ఒక గిన్నె తీసుకొని అందులో ఇడ్లీలను వేసి చేతితో మెత్తగా పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె (Oil) వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, సెనగపప్పు (Senagapappu) వేసి వేయించుకోవాలి.
తర్వాత పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఒక నిమిషం తరువాత క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, క్యాప్సికం ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులో సాంబార్ పొడి (Sambar powder), కారం (Chilly powder) వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
మసాలాంతా బాగా వేగిన తర్వాత పొడి చేసుకున్న ఇడ్లీ మిశ్రమాన్ని వేసి బాగా కలిపి (Mix well) కొద్దిగా నీళ్ళు చల్లి మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు ఉడికించాలి. చివరిలో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన (Delicious) వేడి వేడి ఇడ్లీ మసాలా ఉప్మా రెడీ.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మిగిలిపోయిన ఇడ్లీలతో ఇలా ఉప్మాను ట్రై చేయండి. ఇలా ఎప్పటికప్పుడు రొటీన్ (Routine) గా చేసుకునే వంటలు కాస్త వెరైటీగా ట్రై చేసే ఇంటిల్లిపాదీ తినడానికి ఇష్టపడుతారు (Love to eat). మిగిలిపోయిన ఇడ్లీలను పడేయకుండా ఇలా ఇడ్లీలను ట్రై చేయండి.