జర్నీలో వాంతులు కాకూడదంటే ఏం చేయాలి?
చాలా మందికి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు వివారంగా అనిపిస్తుంది. వాంతులు కూడా అవుతుంటాయి. చిన్న పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఇలా అవుతుంది. అయితే కొన్ని చిట్కాలతో వాంతులు కాకుండా చూసుకోవచ్చు. అదెలాగంటే?
కొంతమందికి జర్నీ అస్సలు పడదు. కారు, బస్సలు, ట్రైన్ లో జర్నీ చేస్తున్నప్పుడు తలనొప్పితో పాటుగా వాంతులు కూడా అవుతుంటాయి. ఈ మోషన్ సిక్నెస్ చాలా మందికి ఉంటుంది. దీనిలో మైకంగా అనిపించి వాంతులు అవుతాయి. ఇది ఎక్కువగా పిల్లలు, వృద్ధుల్లో కనిపిస్తుంది. దీనివల్ల చాలా మంది జర్నీ చేయడానికే భయపడిపోతుంటారు. అయితే మీరు గనుక కొన్ని చిట్కాలను పాటిస్తే జర్నీ చేస్తున్నప్పుడు వాంతులు అస్సలు కావు. అవేంటంటే?
పుదీనా నీరు
పుదీనాలో ఔషదగుణాలు ఉంటాయి. ఇవి వాంతులు రాకుండా చేస్తాయి. అందుకే మీరు ప్రయాణం చేసేటప్పుడు పుదీనాను వాటర్ బాటిల్ లో కలపండి. ఆ నీటినే తాగుతూ ఉండండి. ఈ వాటర్ మిమ్మల్ని రిఫ్రెష్ గా ఉంచుతుంది. అలాగే ఇది వికారం, కడుపు నొప్పిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
అల్లం
అల్లం ఎన్నో అనారోగ్య సమస్యలను ఇట్టే తగ్గిస్తుంది. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అల్లాన్ని ఉపయోగిస్తే మీరు జర్నీలో వాంతులు చేసుకునే అవకాశం ఉండదు. అందుకే మీరు ప్రయాణించేటప్పుడు చిన్న అల్లం ముక్కను తీసుకెళ్లండి. ఇది మోషన్ సిక్నెస్ వల్ల కలిగే వికారం, వాంతులను తగ్గించడానికి సహాయపడుతుంది.
నిమ్మకాయ
నిమ్మరసం మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. అలగే మనల్ని రీఫ్రెష్ గా ఉంచుతుంది. ఇది మీరు వాంతులు చేసుకోకుండా కూడా ఆపుతుంది తెలుసా? మీరు జర్నీ చేసేటప్పుడు మీతో పాటుగా నిమ్మరసం తప్పకుండా తీసుకెళ్లండి. మీకు వికారంగా లేదా వాంతులు వచ్చేటట్టు అనిపిస్తే నిమ్మకాయరసం తాగండి. ఈ నిమ్మ వాసన మీకు రిఫ్రెష్ అనుభూతిని కలిగిస్తుంది. వాంతులు కాకుండా ఆపుతుంది.
తులసి ఆకులు
తులసిలో దివ్య ఔషదగుణాలుంటాయి. దీన్ని ఉపయోగించి దగ్గు, జలుబును తగ్గించుకోవచ్చు. అలాగే ఇది వాంతులు కాకుండా కూడా ఆపుతుంది. మీకు ప్రయాణంలో వికారంగా, మైకంగా, వాంతులు వచ్చేటట్టు అనిపిస్తే తులసి ఆకులను నోట్లో వేసుకుని నమలండి. ఇది వాంతులు రాకుండా చేస్తుంది.
motion-sickness
ఆరెంజ్ మిఠాయి
ఆరెంజ్ మిఠాయిలను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే ఆరెంజ్ మిఠాయి కూడా వాంతులు కాకుండా ఆపుతుంంది. మీకు జర్నీ చేసేటప్పుడు మైకము లేదా వికారం అనిపిస్తే ఆరెంజ్ మిఠాయి తినండి. ఇది వాంతులను నివారిస్తుంది.
లవంగాలు
లవంగాలను ఉపయోగించి మీరు ఎన్నో చిన్న చిన్న సమస్యలను తగ్గించుకోవచ్చు. లవంగాల్లో యాంటీసెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రయాణ సమయంలో వికారాన్ని వెంటనే తగ్గిస్తాయి.