ఉదయం ఎసిడిటీ, గుండెల్లో మంట తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా?
చాలా మందికి ఉదయంపూటే కాకుండా రాత్రిపూట కూడా గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు వస్తుంటాయి. అయితే ఈ సమస్యను తగ్గించడంలో కొన్ని చిట్కాలు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.
acidity
తప్పుడు ఆహారపు అలవాట్లు లేదా సరైన జీవనశైలి లేకపోవడం వల్ల కడుపునకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయి. రాత్రిపూట లేట్ గా తినడం, ఉదయం లేట్ గా నిద్రలేవడం, హెవీగా తినడం, లేదా నిద్ర లేకపోవడం వంటివి ఎసిడిటీకి కారణమవుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇలాంటి సమస్యలు రాకూడదంటే రాత్రిపూట తేలికపాటి భోజనం చేయాలి. అలాగే రాత్రి భోజనం 7-8 గంటల కల్లా చేయాలి. మీకు తెలుసా? రాత్రిపూట లేట్ గా తినడం వల్ల లేదా ఇతర కారణాల వల్ల వచ్చే ఎసిడిటీని కొన్ని చిట్కాలు చాలా తొందరగా తగ్గిస్తాయి. ఉదయాన్నే ఎసిడిటీని తగ్గించుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
acidity
పరిగడుపున సోంపు నీరు
పరిగడుపున సోంపు నీరు తాగడం వల్ల ఎసిడిటీ నుంచి చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. సోంపు మీ జీర్ణక్రియను సరిచేస్తుంది. అలాగే కడుపు వేడిని తగ్గిస్తుంది. ఒక టీస్పూన్ సోంపును తీసుకుని దీన్ని రాత్రంతా నీటిలో నానబెట్టి దీన్ని ఉదయాన్నే మరిగించి పరిగడుపున తాగాలి. ఈ వాటర్ ను తాగడం వల్ల ఎంజైమ్ స్రావం పెరుగుతుంది. అలాగే ఎసిడిటీ, మలబద్దకాన్ని తొలగించడంతో పాటుగా ఇది జీవక్రియను కూడా పెంచుతుంది. దీంతో మీరు ఆరోగ్యంగా బరువు కూడా తగ్గుతారు.
నిమ్మకాయ, అల్లం వాటర్
అల్లం నీరు, నిమ్మకాయ జీర్ణక్రియకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రెండూ జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. తొలగిస్తాయి. అల్లంలో జింజెరోల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణరసాల స్రావానికి సహాయపడుతుంది. అలాగే నిమ్మకాయ అజీర్ణం, గ్యాస్ ను కూడా తగ్గిస్తుంది. అందుకే హెవీగా తిన్న తర్వాత ఈ రెండు పదార్థాలను నీటిలో కలిపి తాగితే ఉదయం పూట ఎసిడిటీ ఉండదు.
తిన్న వెంటనే నిద్రపోకూడదు
రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం మీ జీర్ణక్రియకు అస్సలు మంచిది కాదు. రాత్రి 7-8 గంటల మధ్య డిన్నర్ చేయండి. మీరు రాత్రితినడానికి, నిద్రపోవడానికి మధ్య కనీసం 2-3 గంటల గ్యాప్ ఉండేట్టు చూసుకోండి. మీరు తిన్న వెంటనే నిద్రలోకి జారుకుంటే మీ జీర్ణక్రియ మరింత దెబ్బతింటుంది. అందుకే తిన్న తర్వాత కాసేపు నడవండి.