వర్షాకాలంలో యోని సంక్రమణను నివారించే మార్గాలు
వర్షాకాలం మన రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ముఖ్యంగా మహిళల్లో.. వర్షాకాలంలో మూత్ర మార్గ సంక్రమణతో సహా ఎన్నో రకాల యోని వ్యాధులు వస్తాయి.

వర్షాకాలం వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. కానీ ఇది యోని ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. వర్షాకాలంలో ఈస్ట్ ఇన్ఫెక్షన్లు లేదా బాక్టీరియల్ వాగినోసిస్ వంటి అంటువ్యాధులు వస్తాయి. తేమ, తడి వల్ల ఈ సమస్యలు వస్తాయి. ఇవి బ్యాక్టీరియా, ఫంగస్ కు నిలయంగా మారుతాయి. పరిశుభ్రత సరిగ్గా లేకున్నా, చికాకు కలిగించే వాటిని ఉపయోగించినా, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించినా లేదా టాంపోన్లు లేదా ప్యాడ్లను తరచుగా ఉపయోగించినా యోని ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది.
వర్షాకాలంలో యోని సంక్రమణ సాధారణ లక్షణాలు
చర్మంపై దద్దుర్లు
యోని చికాకు
తీవ్రమైన ఉత్సర్గ
ప్రైవేట్ పార్ట్స్ చుట్టూ ఎరుపు
యోని అసౌకర్యం
మూత్ర విసర్జన చేసేటప్పుడు లేదా లైంగిక కలయిక సమయంలో మంట
యోని ఆరోగ్యంగా ఉండేందుకు ఏం చేయాలంటే?
నెలసరి పరిశుభ్రత
మీరు పీరియడ్ సమయంలో పరిశుభ్రత పాటించకపోతే.. ముఖ్యంగా వర్షాకాలంలో సంక్రమణ ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఈ సమయంలో మీ యోని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శానిటరీ ప్యాడ్స్ ను 4 నుంచి 6 గంటలకు ఒకసారి మారుస్తూనే ఉండండి. అలాగే టాంపోన్లను కూడా మార్చండి. అలాగే యోని ప్రాంతంలో సువాసనగల వస్తువులను ఉపయోగించకండి. అలాగే బ్యాక్టీరియా వ్యాప్తిని ఆపడానికి మీ చేతులను తరచుగా కడగండి.
పీహెచ్ స్థాయిని నిర్వహించండి
యోని ప్రాంతాన్ని క్రమం తప్పకుండా కడగడానికి మితమైన, పీహెచ్-సమతుల్య క్లెన్సర్లు, వెచ్చని నీటిని ఉపయోగించండి. యోని సాధారణ పిహెచ్ సమతుల్యతను దెబ్బతీసే ఘాటైన సబ్బులు లేదా డౌచ్లను ఉపయోగించడం మానుకోండి.
తడి లేకుండా ఆరబెట్టండి
ఎక్కువసేపు తడిగా ఉన్న లోదుస్తులు అంటువ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. అంటువ్యాధులకు దూరంగా ఉండాలంటే వర్షంలో తడిసిన లేదా చెమట పట్టిన తర్వాత వీలైనంత త్వరగా పొడి బట్టలును వేసుకోండి.
పబ్లిక్ రెస్ట్ రూమ్ లకు దూరంగా ఉండండి
వ్యాధికారక సూక్ష్మక్రిములు, ఫంగస్ తో యోని సంక్రమణ ప్రమాదం పెరుగుతుంది. అందుకే శుభ్రమైన, ప్రైవేట్ బాత్రూమ్ లను మాత్రమే ఉపయోగించండి. పబ్లిడ్ రెస్ట్ రూం లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండకపోవచ్చు. మీరు ఒకదాన్ని ఉపయోగించాల్సి వస్తే అది శుభ్రంగా ఉందేమో చూడండి. అలాగే టాయిలెట్ పేపర్ లేదా డిస్పోజబుల్ సీట్ కవర్లను ఉపయోగించడానికి ప్రయత్నించండి.
vaginal infection
హైడ్రేటెడ్ గా ఉండండి
కాలుష్య కారకాలను తొలగించడానికి, యోనిని ఆరోగ్యంగా ఉంచడానికి మీరు పుష్కలంగా నీటిని తాగాలి. నీరు శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపుతుంది.
కాటన్ అండర్ వేర్
శ్వాసించదగిన లోదుస్తులు జననేంద్రియ ప్రాంతాన్ని పొడిగా, గాలి వెలుతురు వచ్చేలా చేస్తాయి. బిగుతైన ఇన్నర్స్, షార్ట్స్ లేదా స్లిమ్ జీన్స్ ను వేసుకోవడం మానుకోండి. ఎందుకంటే అవి గాలి ప్రవాహాన్ని తగ్గిస్తాయి. అలాగే యోని ప్రాంతంలో చెమట పట్టేలా చేస్తాయి. ఇది దద్దుర్లు, సంక్రమణకు కారణమవుతుంది.
సేఫ్ సెక్స్
ఎస్టీడీల ప్రమాదాన్ని తగ్గించడానికి, ఆరోగ్యకరమైన యోని కోసం లైంగిక కార్యకలాపాల సమయంలో కండోమ్ లను ఖచ్చితంగా ఉపయోగించండి.