పెరుగుతున్న కండ్లకలక కేసులు.. వర్షాకాలంలో ఈ కంటి సమస్య రాకుండా ఉండటానికి, తొందరగా తగ్గడానికి చిట్కాలు మీకోసం
ప్రస్తుతం మన దేశంలో కండ్లకలక కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరి ఈ సీజన్ లో ఈ సమస్య రావొద్దంటే ఏం చేయాలంటే?
వర్షాకాలం వచ్చిందంటే సార్లు కండ్లకలక వచ్చే అవకాశం పెరుగుతుంది. ప్రస్తుతం భారత రాజధాని న్యూఢిల్లీలో ప్రతిరోజూ సుమారు 100 కొత్త కండ్లకలక కేసులు నమోదవుతున్నాయట. ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. అందుకే ఈ సంక్రమణ నుంచి మన కళ్లను రక్షించడానికి, దాని నివారణా చిట్కాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. వర్షాకాలంలో కండ్ల కలకను తొందరగా ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కండ్లకలకను సాధారణంగా రెడ్ ఐస్ అని కూడా పిలుస్తారు. ఎక్కువ తేమ, నీటి ద్వారా వచ్చే వ్యాధికారకాల కారణంగా వర్షాకాలంలో కండ్లకలక వస్తుంది. వైరల్ లేదా బాక్టీరియల్ అయినా కండ్లకలక మన కళ్లలో అసౌకర్యం, ఎరుపు, దురదను కలిగిస్తుంది. అసలు వర్షాకాలంలో కండ్ల కలక రావొద్దంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Conjunctivitis
వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి
కండ్లకలకను నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ఒకటి. ఇందుకోసం మీ చేతులను సబ్బు, నీటితో క్రమం తప్పకుండా కడగాలి. ముఖ్యంగా ఏదైనా వస్తువులను తాగినప్పుపు. అలాగే తినడానికి ముందు, బాత్ రూం కు వెళ్లి వచ్చిన తర్వాత. మీ కళ్లను తరచుగా తాకడం లేదా రుద్దడం మానుకోవాలి. ఎందుకంటే అలా చేయడం వల్ల అంటువ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా , వైరస్లు కండ్లలోకి వెళతాయి.
మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి
మీరుంటున్న ప్లేస్ లో దుమ్ము, దూళి ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇవి కంటి చికాకును పెంచుతాయి. కండ్లకలక వచ్చే ప్రమాదం తగ్గాలంటే మీ పరిసరాలను శుభ్రంగా, దుమ్ము లేకుండా ఉంచండి. అలాగే మీ ఇంటిని క్రమం తప్పకుండా వాక్యూమ్ చేయండి.
Conjunctivitis
వ్యక్తిగత వస్తువులను పంచుకోవద్దు
టవల్స్, హాంకీలు, ఐ మేకప్, కాంటాక్ట్ లెన్సులు వంటి కలుషితమైన వ్యక్తిగత వస్తువుల ద్వారా కండ్లకలక చాలా సులువుగా వ్యాప్తి చెందుతుంది. అందుకే మీ పర్సనల్ వస్తువులను పంచుకోకండి.
రద్దీ ప్రదేశాలను నివారించండి
వర్షాకాలంలో రద్దీగా ఉండే ప్రదేశాలు కండ్లకలకతో సహా ఎన్నో అంటువ్యాధులకు సంతానోత్పత్తి కేంద్రాలుగా మారొచ్చు. అంటువ్యాధులకు గురయ్యే ప్రమాదాన్ని తగ్గించడానికి ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండండి.
సమతుల్య ఆహారం
ఖనిజాలు, విటమిన్లు, ముఖ్యంగా విటమిన్ ఎ ఎక్కువగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. ఇది మీ కంటి ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. కంటి ఇన్ఫెక్షన్ల నుంచి మీ కళ్లను రక్షించడానికి ఆకుకూరలు, క్యారెట్లు, సిట్రస్ పండ్లు, ఇతర పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని మీ రోజువారి ఆహారంలో చేర్చండి.
వర్షం సమయంలో ఇళ్లలోనే ఉండండి
నీటి ద్వారా కూడా అంటువ్యాధులు వచ్చేచ అవకాశం ఉంది. అందుకే వర్షం ఎక్కువగా పడుతున్నప్పుడు ఇళ్లలో ఉండటానికి ప్రయత్నించండి. మీరు బయటకు వెళ్లాల్సి వస్తే మీ కళ్లను రక్షించడానికి సన్ గ్లాసెస్ వంటి రక్షిత కళ్లజోడును పెట్టుకోండి.
Conjunctivitis
వర్షాకాలంలో కండ్లకలకకు ఎలా చికిత్స చేయాలి?
మీ కళ్లను తాకడం లేదా రుద్దడం మానుకోండి
కండ్ల కలక వల్ల కళ్లను తరచుగా రుద్దాలనిపిస్తుంది. కానీ ఇలా చేయడం వల్ల మీ పరిస్థితిని మరింత దిగజారుతుంది. అంతేకాదు ఇది మీ ముఖం ఇతర ప్రాంతాలకు సంక్రమణకు దారితీస్తుంది. అందుకే కండ్లను రుద్దకండి.
వెచ్చని కంప్రెస్లు
కళ్లను మూసి వెచ్చని కంప్రెస్ లను పెట్టండి. ఇది దురదను తగ్గిస్తుంది. అలాగే కండ్లకలకతో సంబంధం ఉన్న అసౌకర్యాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇందుకోసం గోరువెచ్చని నీటిలో నానబెట్టిన శుభ్రమైన గుడ్డను కళ్లపై కొన్ని నిమిషాలు పెట్టండి.
కాంటాక్ట్ లెన్సులు ధరించడం మానుకోండి
మీరు కాంటాక్ట్ లెన్సులు ధరిస్తే మీ కళ్లు పూర్తిగా కోలుకునే వరకు వాటిని ఉపయోగించడం మానుకోండి. ఎందుకంటే కాంటాక్ట్ లెన్సులు బ్యాక్టీరియాను ట్రాప్ చేయగలవు. అలాగే కండ్లకలక తొందరగా తగ్గకుండా చేస్తుంది.
ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచండి
సంక్రమణ మరింత వ్యాప్తి చెందకుండా ఉండటానికి మీ కళ్లను తాకే ముందు మీ చేతులను సబ్బు, నీటితో బాగా కడగండి. ఈ కంటి సమస్య ఉంటే టవల్స్, ఇతర వ్యక్తిగత వస్తువులను వేరేవారికి ఇవ్వకండి.
Conjunctivitis
వైద్యుడిని సంప్రదించండి
కండ్లకలక రకాన్ని ఖచ్చితంగా నిర్ధారించడానికి, తగిన చికిత్స పొందడానికి కంటి డాక్టర్ ను తప్పకుండా సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని లక్షణాలను తగ్గించడానికి, కంటి సంక్రమణను తగ్గించడానికి కంటి చుక్కలు లేదా లేపనాలను సూచించొచ్చు.
మీరు కండ్లకలక యొక్క ఏవైనా లక్షణాలను అనుభవిస్తే, సరైన రోగ నిర్ధారణ మరియు చికిత్స కోసం వెంటనే వైద్యుడిని సంప్రదించండి. సరైన జాగ్రత్తలతో, మీరు మీ కళ్ళను కండ్లకలక వంటి ఇన్ఫెక్షన్ల నుండి రక్షించుకోవచ్చు మరియు ఆహ్లాదకరమైన వర్షాకాలాన్ని ఆస్వాదించవచ్చు.