డయాబెటీస్ ఉన్నవాళ్లు అన్నం ఎలా తినాలి?
డయాబెటీస్ ఉన్నవాళ్లు సాధ్యం అయినంత వరకు అన్నాన్ని తినకూడదని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అసలు అన్నాన్ని ఎలా తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగవో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
rice
ఒకప్పుడు డయాబెటీస్ నూటిలో ఏ ఒక్కరికో, ఇద్దరికో వచ్చేది. ఇప్పుడు చాలా మంది దీనిబారిన పడుతున్నారు. ప్రస్తుత కాలంలో డయాబెటీస్ సర్వసాధారణమైన వ్యాధిగా మారిపోయింది. డయాబెటిస్ ఉన్నవారు ఆహారంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే కొన్ని ఆహారాల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.
సాధారణంగా బియ్యంలో కార్భోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అందుకే డయాబెటీస్ పేషెంట్లు అన్నాన్ని పూర్తిగా మానేస్తుంటారు. కానీ డయాబెటీస్ ఉన్నవారు కూడా అన్నాన్ని తినొచ్చు. అవును మధుమేహులు కూడా అన్నం తినొచ్చు. కానీ తక్కువ మొత్తంలో తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
డయాబెటీస్ పేషెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదకర స్థాయికి పెరగకుండా ప్రతిరోజూ ఆహారాన్ని పర్యవేక్షించాలి. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకూడదంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారాలను తినాలి. అయితే బియ్యంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది.
డయాబెటిస్ ఉన్నవారు ఎప్పుడూ కూడా బ్రౌన్ రైస్ నే తినాలి. మధుమేహులకు వైట్ రైస్ కంటే బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్ యే మంచిది. బ్రౌన్ రైస్ సాధారణంగా మధుమేహానికి మంచిది కాదు. ఎందుకంటే బ్రౌన్ రైస్ వైట్ రైస్ కంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అలా అని వీటిని కూడా ఎక్కువగా తినకూడదు.
మధుమేహులు అన్నాన్ని ముందుగా అన్నం వండి పక్కన పెట్టాలి. ఇది చల్లారిన తర్వాత ఫ్రిజ్ లో పెట్టాలి. 8-10 గంటల తర్వాత బయటకు తీసి వేడి చేసి తినండి. ఈ అన్నంలో రెసిస్టెంట్ స్టార్చ్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తిన్నా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగవు.
ఈ అన్నం డయాబెటిస్ ను నివారించడానికి సహాయపడటమే కాకుండా.. గట్ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అలాగే శరీరంలో ఇన్సులిన్ కార్యకలాపాలు కూడా మెరుగుపడతాయి. టైప్ 2 డయాబెటిస్ తో పాటుగా ఎన్నో వ్యాధులకు ఈ పద్దతి ప్రయోజనకరంగా ఉంటుంది. వండిన చిక్కుళ్లు, గింజలు, కొవ్వు లేని మాంసం, గుడ్లను అన్నంతో కలిపి తినొచ్చు. కాకపోతే అన్నాన్ని మరీ ఎక్కువగా తినకూడదు. ప్రతిరోజూ అన్నం తిన్న తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ తప్పకుండా చెక్ చేసుకోవాలి. మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగాయో లేదో తెలుసుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది.