మందులు వాడకుండా బీపీని ఎలా తగ్గించుకోవాలి?
అధిక రక్తపోటు సమస్య మనం అనుకునేంత చిన్న సమస్యేం కాదు. ఎందుకంటే ఇది మనిషి ప్రాణాలను ఈజీగా రిస్క్ లో పెట్టగలదు. అందుకే ఈ వ్యాధి ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. బీపీని కంట్రోల్ లో ఉంచుకోవాలి.
ఒక్కప్పుడు పెద్దవయసు వారికి మాత్రమే వచ్చేకొన్ని వ్యాధులు నేడు అన్ని వయసుల వారికీ వస్తున్నాయి. అందులోనూ ఇవి సర్వసాధారణ వ్యాధులుగా మారిపోయాయి. ఇలాంటి వాటిలో అధిక రక్తపోటు ఒకటి.
అధిక రక్తపోటు తేలిగ్గా తీసిపారేసేంత చిన్న సమస్యేం కాదు. ఎందుకంటే ఇది గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక గుండె జబ్బులకు దారితీస్తుంది. అందుకే ఈ సమస్య ఉన్నవారు రెగ్యులర్ గా మందులు వాడుతుంటారు. అయితే మందులు వాడకుండా కూడా ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
fitness
ఫిట్‌గా ఉండండి
బరువు పెరిగే కొద్దీ రక్తపోటు కూడా బాగా పెరుగుతుంది. బరువు ఒక్క రక్తపోటునే కాకుండా ఎన్నో వ్యాధులొచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే మీ బరువును అదుపులో ఉంచుకోండి. బరువు అదుపులో ఉంటే మీ రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
స్మోకింగ్
ధూమపానం కూడా అధిక రక్తపోటుకు దారితీస్తుంది. స్మోకింగ్ చేస్తే మీ రక్తపోటు అమాంతం పెరుగుతుంది. అంతేకాకుండా ఈ స్మోకింగ్ క్యాన్సర్ కు కూడా దారితీస్తుంది. ధూమపానం మానేయడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
sodium
సోడియం తీసుకోవడం తగ్గించండి
ఉప్పు కూడా రక్తపోటును బాగా పెంచుతుంది. అందుకే బీపీ పేషెంట్లు ఉప్పును మోతాదులోనే తినాలి. బీపీ పెరగకూడదంటే రోజువారీ సోడియాన్ని 1500mg వరకు పరిమితం చేయండి. ఇందులో చిన్న తగ్గింపు కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే మీ రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
ఆల్కహాల్
అతిగా ఆల్కహాల్ ను తాగడం మీ గుండె ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది మీ గుండెను రిస్క్ లో పడేస్తుంది. ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం వల్ల మీ బరువు పెరగడంతో పాటుగా బీపీ కూడా పెరుగుతుంది. అందుకే రక్తపోటు అదుపులో ఉండాలంటే ఆల్కహాల్ ను లిమిట్ లో తాగండి.
కంటినిండా నిద్ర
రాత్రిళ్లు కంటినిండా నిద్రపోకపోతే కూడా మీ రక్తపోటు బాగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే మీ రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి ప్రతిరోజు రాత్రి 8 గంటలు బాగా నిద్రపోండి. నిద్ర మిమ్మల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది.
Stress
ఒత్తిడికి దూరంగా ఉండండి
ఒత్తిడి లైట్ తీసుకునేంత చిన్న సమస్య కానేకాదు. ముఖ్యంగా ఇది గుండెకు అస్సలు మంచిది కాదు. అలాగే ఇది రక్తపోటును కూడా బాగా పెంచుతుంది. అందుకే ఒత్తిడికి దూరంగా ఉండండి. ఇందుకోసం యోగా, ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు చేయండి.
healthy food
ఆరోగ్యమైన ఆహారం
తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినండి. అలాగే పాలు వంటి పాల ఉత్పత్తులను తగ్గించడానికి ప్రయత్నించండి. అలాగే ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం మానేయండి. ఇవి మీ బీపీని పెంచుతాయి.