MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Health
  • అరవకండి.. ఆరోగ్యం దెబ్బతింటుంది

అరవకండి.. ఆరోగ్యం దెబ్బతింటుంది

భార్యాభర్తలు కొట్లాడినప్పుడు.. పిల్లలు కొంటెపనులు చేసినప్పుడు చాలా మంది అరుస్తారు. కోపంతో ఊగిపోతారు. కానీ కోపంతో బిగ్గరగా అరవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి తెలుసా? . 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Feb 17 2024, 01:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మన దైనందిన జీవితంలో ఎన్నో కారణాల వల్ల ఒత్తిడికి గురవుతుంటాం. ఇంటి పనులు, ఆఫీసు పనులు, పిల్లల బాగోగులు, కుటుంబం బాధ్యతలు మూడ్ స్వింగ్స్ కు కారణమవుతాయి. ముఖ్యంగా ఇవి ఆడవాళ్ల మూడ్ ను నాశనం చేస్తుంటాయి. దీనివల్ల ఆడవాళ్లకు పట్టరాని కోపం, చిరాకు, విసుగు ఎక్కువవుతాయి. ఈ భావాలన్నింటినీ వీళ్లు గట్టిగా అరవడం, తిట్టడం, ఇంట్లో సామాన్లను కిందేయడం వంటి పనుల ద్వారా వ్యక్తపరుస్తారు. ఇక కొంటె పనులు, అల్లరి పనులు చేసే పిల్లలున్న ఇండ్లలో ఆడవాళ్లు గట్టి గట్టిగా అరుస్తూనే ఉంటారు. ఇలా అరవడం నిత్యకృత్యంగా మారుతుంది. కానీ దీనివల్ల పిల్లలకు శారీరక, మానసిక సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

గట్టిగా అరవడం వల్ల స్వరపేటిక, గొంతుపై ఒత్తిడి పడుతుంది. గొంతులోని స్వరపేటికలో ప్రకంపనల వల్లనే మనం మాట్లాడగలుగుతాం. అయితే మీరు  గట్టిగా మాట్లాడటం, అరవడం వల్ల స్వరపేటికలోని సన్నని కండరాలు దెబ్బతింటాయి. అలాగే కాలక్రమేణా మీరుమాట్లాడటం కష్టంగా మారుతుంది. ఎక్కువగా అరిచే వారికి రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం 6 రెట్లు ఉందని నిపుణులు చెబుతున్నారు. 
 

36

కోపంతో మీరు అరిచిన ప్రతిసారీ మీ హృదయ స్పందన రేటు బాగా పెరుగుతుంది. కోపం పెరిగితే శరీరంలో రక్తపోటు పెరుగుతుంది. దీనివల్ల గుండె సక్రమంగా కొట్టుకోదు. అలాగే ఫాస్ట్ ఫాస్ట్ గా గుండె కొట్టుకోవడం మొదలుపెడుతుంది. అలాగే శ్వాస వేగం పెరుగుతుంది. అలాగే కండరాలపై ఒత్తిడి బాగా పడుతుంది. 
 

46

మీకు తెలుసా? కోపంతో అరవడం వల్ల మీ శరీరంలో హార్మోన్ల మార్పులు వస్తాయి. ఇది జీవక్రియను నెమ్మదింపజేస్తుంది. ఎప్పుడూ కోపంతో అరిచేవారికి తలనొప్పి, యాంగ్జైటీ, నిద్రలేమి, జీర్ణ సంబంధిత సమస్యలు, చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది.
 

56

ఎప్పుడూ అరవడం వల్ల పిల్లలు, తల్లిదండ్రుల మధ్య సంబంధాలలో విభేదాలు వస్తాయి. అలాగే పిల్లలకు తల్లిదండ్రులంటే భయం ఏర్పడుతుంది. ప్రేమ తగ్గుతుంది. తల్లిదండ్రులు గట్టిగా మందలించడం వల్ల పిల్లలకు ఎన్నో శారీరక, మానసిక సమస్యలు కూడా వస్తాయి. 
 

66

బాల్యంలో మెదడు, శరీర అవయవాల అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. కానీ తల్లిదండ్రులు గట్టిగా మందలిస్తే పిల్లల మెదడు ఎదుగుదల దెబ్బతింటుంది. ఇలాంటి పరిస్థితిలో పెరిగే పిల్లలకు ఆర్థరైటిస్, తలనొప్పి, వెన్ను, మెడ నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved