వీటిని తింటున్నారా? ఒంట్లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది జాగ్రత్త..
మన శరీరం బాగా పనిచేయడానికి కొలెస్ట్రాల్ చాలా అవసరం. మన శరీరంలో అధిక సాంధ్రత కలిగిన లిపోప్రోటీన్ లేదా మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది.

నిశ్చల జీవనశైలి ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. రోజంతా వ్యాయామం లేకుండా కూర్చోవడం, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్, కొవ్వు కాలేయంతో సహా ఎన్నో ప్రాణాంతక జీవనశైలి వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ఉరుకుల పరుగుల జీవనశైలిలో చాలా మంది సులభంగా వండగలిగే ప్యాకేజ్డ్ ఆహారాలకే అలవాటు పడ్డారు. కానీ అనారోగ్యకరమైన ఆహారాలు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగేందుకు సహాయపడతాయి.
high cholesterol
మన శరీరం బాగా పనిచేయడానికి కొలెస్ట్రాల్ చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన మొత్తంలో అధిక-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ లేదా మంచి కొలెస్ట్రాల్ ను కలిగి ఉండటం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం చాలా తగ్గుతుంది. యు.ఎస్. లో 90 మిలియన్లకు పైగా పెద్దలకు అధిక కొలెస్ట్రాల్ ఉందని నివేదికలు చెబుతున్నాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
cholesterol
అధిక ఎల్డిఎల్ తో ట్రైగ్లిజరైడ్లు జీవక్రియ వ్యాధులు, గుండెపోటు వంటి ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి. అసలు ఎలాంటి ఆహారాలు చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
బేకరీ ఫుడ్స్
బేకరీ ఐటమ్స్ అయిన బిస్కెట్లు, కేకులు, పేస్ట్రీ, పఫ్స్, క్రీమ్ రోల్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ ఆహారాలు కొవ్వుతో తయారు చేయబడతాయి. అంటే వీటిలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ట్రాన్స్ ఫ్యాట్స్ ను ఎక్కువగా కలిగున్న ఈ ఆహారాలను తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుంది.
ప్రాసెస్డ్ ఫుడ్స్
సాసేజ్లు, బర్గర్లు, బేకన్ వంటి స్తంభింపచేసిన అన్ని మాంసాలు చెడిపోకుండా ఉండానికి రసాయనాలను ఉపయోగిస్తారు. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచడమే కాకుండా క్యాన్సర్ కు కూడా కారణమవుతాయి. అందుకే వీటిని మొత్తమే తినకపోవడమే మంచిది.
జర్నల్ ఎక్స్పెరిమెంటల్ ఫిజియాలజీలో ప్రచురించబడిన 2016 అధ్యయనంలో.. జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం బాగా దెబ్బతింటుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి, రక్షించడానికి ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిని నిర్వహించాలి.
ఫాస్ట్ ఫుడ్
పావ్ బాజీ, సమోసా వంటి భారతీయ ఫాస్ట్ ఫుడ్స్ అలాగే పిజ్జా, బర్గర్స్ వంటి పాశ్చాత్య ఆహారాలలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలను తినడం, దీనికి తోడు వీటిని మళ్లీ మళ్లీ ఉపయోగించిన నూనెలో వేయించడం.. ఇవన్నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అధిక కొవ్వు, అధిక కార్బోహైడ్రేట్ భాగాలు, తక్కువ ఫైబర్ ఉన్న ఆహారాలు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఎందుకంటే ఇవి కొలెస్ట్రాల్ ను పెంచడమే కాకుండా ఊబకాయానికి కూడా దారితీస్తాయి.
తీపి పానీయాలు
ప్యాక్ చేసిన రసాలు, అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ఉన్న ఉత్పత్తులు, వైట్ బ్రెడ్, డెజర్ట్ లను తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.