MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • చలికాలంలో సైలెంట్ హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువ.. గుండెపోటును ఎలా గుర్తించాలంటే?

చలికాలంలో సైలెంట్ హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువ.. గుండెపోటును ఎలా గుర్తించాలంటే?

చలికాలంలో మన ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సీజన్ లో మన ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల మీరు ఎన్నో రోగాల బారిన పడతారు. అంతేకాదు ఈ సీజన్ లో గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంటుంది. మరి దీన్ని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Shivaleela Rajamoni | Published : Dec 05 2023, 12:38 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
110
Asianet Image

చలికాలం మన ఆరోగ్యాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. ముందే ఈ సీజన్ లో మన రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీనివల్ల లేనిపోని రోగాల బారిన పడతాం. కాగా ఈ సీజన్ లో డయాబెటిస్, హార్ట్ పేషెంట్లు ఆరోగ్యం విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చలికాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సీజన్లో ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. 

210
heart attack

heart attack

గుండెపోటు ఒక ప్రాణాంతక సమస్య. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అందుకే బాధితులు సకాలంలో చికిత్స చేయించుకోవాలి. కానీ చాలా సార్లు గుండెపోటు లక్షణాలను చాలా మంది గుర్తించరు. దీనివల్లే ప్రాణాల మీదికి వస్తుంది. ఈ ఆర్టికల్ లో మనం సైలెంట్ గుండెపోటు అంటే ఏంటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.. 

310
Asianet Image

సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటే? 

సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటే మరేదో కాదు.. గుండెపోటే. కానీ ఈ గుండెపోటు లక్షణాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. అంటే సైలెంట్ గుండెపోటు ఛాతీ నొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగించదు. కానీ ఇది గుండెపోటుతో సంబంధం కలిగి ఉంటుంది. అయితే లక్షణాలు మాత్రం కనిపించవు. 
 

410
Asianet Image


సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణాలు 

అజీర్ణం
మైకంగా అనిపించడం
నిద్ర లేమి
అస్వస్థతకు గురికావడం
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
దీర్ఘకాలిక అలసట
వెనుక లేదా ఛాతీ కండరాలలో ఒత్తిడి

510
Heart Attack

Heart Attack

సైలెంట్ గుండెపోటుకు కారణాలు

అధిక బరువు

అధిక బరువు మీ గుండెపై అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల సైలెంట్ హార్ట్ ఎటాక్ తో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అంతేకాదు ఊబకాయం అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ కు కూడా కారణమవుతుంది. ఇవి గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి.
 

610
Asianet Image

అధిక రక్తపోటు

సైలెంట్ హార్ట్ ఎటాక్ కు అధిక రక్తపోటు కూడా కారణమవుతుందని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అధిక రక్తపోటు మీ గుండె, ధమనులు, ఇతర ముఖ్యమైన అవయవాలపై ఒత్తిడిని తెస్తుంది. దీంతో సైలెంట్ హార్ట్ ఎటాక్ వస్తుంది. 

710
Asianet Image

అధిక కొలెస్ట్రాల్

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పేరుకుపోవడం వల్ల కూడా గుండెపోటు వస్తుంది. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ లేదా 'చెడు' కొలెస్ట్రాల్ ధమనుల లోపల ఫలకాన్ని ఏర్పరుస్తుంది. ఇది రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. అలాగే నిశ్శబ్ద గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
 

810
Asianet Image

వయసు

సైలెంట్ గుండెపోటుకు వయస్సు కూడా ఒక ప్రధాన కారణమేనంటున్నారు నిపుణులు. నిజానికి వయస్సుతో పాటుగా గుండె సంబంధిత సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుంది. 

910
Asianet Image

ధూమపానం

ప్రస్తుత కాలంలో చాలా మంది స్మోకింగ్ కు బానిసలవుతున్నారు. కానీ ఈ అలవాటు మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. నిజానికి  పొగాకు పొగలో ఉండే విష పదార్థాలు రక్త నాళాలను దెబ్బతీస్తాయి, ఫలకం ఏర్పడే అవకాశాలను పెంచుతాయి. దీనివల్ల సైలెంట్  హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశముంది. 
 

1010
Asianet Image

కుటుంబ చరిత్ర

మీ కుటుంబంలో గుండె జబ్బుల కుటుంబ చరిత్ర ఉంటే మీకు కూడా.. ఈ నిశ్శబ్ద గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. అందుకే మీరు ఎన్నో ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.

Shivaleela Rajamoni
About the Author
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు. Read More...
 
Recommended Stories
Top Stories