Health Tips: వ్యాయామం చేస్తున్నప్పుడే గుండెపోటు రావటమేంటి.. అసలు కారణం ఇదేనా?
Health Tips: ఈమధ్య చాలామంది సామాన్య ప్రజలతో పాటు సెలబ్రెటీలు సైతం వ్యాయామం చేస్తున్నప్పుడే గుండెపోటుకి గురై మరణిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే అలా జరగడానికి గల కారణాలు.. అవగాహన.. ఇప్పుడు పెంచుకుందాం.
జిమ్ చేస్తూ కన్నడ స్టార్ నటుడు పునీత్ రాజ్ కుమార్ చనిపోయినప్పుడు దీని గురించి చర్చ ఎక్కువగా మొదలైంది. ఆ తర్వాత ఇదే విధంగా చాలామంది స్టార్ నటులతో పాటు ఈ మధ్యనే ఒక కానిస్టేబుల్ కూడా చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఎందుకు ఇలా చనిపోతున్నారు అనే విషయం చాలామందికి తెలియదు.
ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం. గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ధమనులలో అకస్మాత్తుగా అడ్డుపడినప్పుడు గుండెపోటు వస్తుంది. కరోనరీ ఆర్టరీలో అడ్డుపడటం వల్ల ఛాతి నొప్పి వస్తుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
వర్కౌట్స్ సమయంలో గుండె జబ్బుల లక్షణాలు శరీరంలో అప్పటికే ఉంటాయి. కానీ కనిపించవు. వ్యాయామం చేసేటప్పుడు శరీరంలో ఆక్సిజన్ కోసం డిమాండ్ పెరుగుతుంది. అందుబాటులో ఉన్న రక్త సరఫరా సరిపోదు కాబట్టి వ్యాయామం చేసేటప్పుడు గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.
కరోనరీ ధమనులలో ఏర్పడే మృదువైన ఫలకాలు పగిలి పెద్దగడ్డ కట్టినప్పుడు కూడా గుండెపోటు సంభవించవచ్చు. తీవ్రమైన వ్యాయామం గుండెలోని ఫ్లేక్ ని డ్యామేజీ చేస్తుంది. అలాగే గుండెలో విద్యుత్ ఆటంకాలు కలుగుతాయి ఇది కార్డియాక్ అరెస్ట్ కి దారితీస్తుంది.
సాధారణంగా ఏదైనా శారీరక శ్రమ సమయంలో గుండెపోటు లేదా గుండె ఆగిపోవడం ఇప్పటికే గుండె సంబంధిత వ్యాధి ఉన్న వారిలో సంభవిస్తుంది. జిమ్ లో ప్రాణాంతకమైన గుండెపోటుకి మరొక కారణం గుండెలో రక్తం గడ్డ కట్టడం ఆకస్మాత్తుగా ఏర్పడడం. ఇది రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది.
అందుకే అధిక వ్యాయామం చేయకండి. అధిక వ్యాయామం మీ శరీరము, మెదడుపై తీవ్రమైన పరిణామాలనే కలిగిస్తుంది. అలాగే ప్రోటీన్ షేప్స్ ని అధికంగా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి వ్యాయామం చేసేటప్పుడు తగిన అవగాహనతోని నిపుణుల పర్యవేక్షణలోని చేయండి.