Health Tips: నూరేళ్ల ఆరోగ్యం కోరుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే?
Health Tips: ఆకుపచ్చని కూరలతో మన ఆయుష్షు పెరుగుతుంది అంటుంది ఆయుర్వేదం. అలాంటి ఆకుపచ్చని కాయగూరలు,ఆకుకూరల లో ఉన్న పోషక విలువలు ఏంటో అవి మన ఆరోగ్యం మీద ఎలాగా ప్రభావం చూపిస్తాయో తెలుసుకుందాం.

ప్రస్తుతం పొల్యూషన్ ప్రపంచంలో ప్రతిదీ మన ఆరోగ్యానికి ప్రతికూలంగా ఉన్నదే. అదేంటంటే తీవ్రమైన ఒత్తిడి, పొల్యూషన్ తో కూడిన వాతావరణం, తినే తిండి దగ్గర నుంచి తాగే నీరు వరకు అంతా కాలుష్యమే. ఆ ప్రభావం అంతా మన ఆయుష్షు మీద పడుతుందని గ్రహించారా.. నిజమేనండి ఈ ప్రభావం అంతా మన ఆరోగ్యం మీదే పడుతుంది.
అయితే ప్రతిదీ మన చేతిలో లేకపోవచ్చు కానీ మన ఆరోగ్యాన్ని కొంతవరకు కాపాడుకోగలటం మాత్రం మన చేతిలోనే ఉంది అంటుంది ఆయుర్వేదం. అదెలాగో చూద్దాం. ఆరోగ్యం బాగా ఉండాలి అంటే ఆకుకూరలు కాయగూరలతో పాటు సరియైన పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
విటమిన్ లు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. నిత్యం మన ఆహారంలో ఆకుపచ్చని కాయగూరలు ఉండేలాగా చూసుకోవాలి దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఆకుపచ్చని కాయగూరలు తినటం వల్ల మూత్రపిండాల్లో ఉండే రాళ్లు కరిగిపోతాయి. అలాగే ఇవి చెడు కొవ్వుని కరిగిస్తుంది. క్యాన్సర్ తో బాధపడేవారు కచ్చితంగా ఆకుపచ్చని కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ తినాలి అని ఆధునిక వైద్యులు సైతం చెప్పడం విశేషం.
వీటిలో ఉండే ఫైబర్ క్యాల్షియం వంటివి క్యాన్సర్ వ్యాధి నుంచి రక్షిస్తాయి. అలాగే ఆకుపచ్చని కాయగూరలలో విటమిన్లు ఖనిజాలు ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. వీటి వలన మీ రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. వీటివల్ల కళ్ళకి చర్మానికి కూడా ఎంతో మంచిది.
కాకరకాయ మెంతికూర లాంటి కూరలు చేదుగా ఉంటాయి కానీ ఇలాంటి వాటిలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది ఇది తినటం వల్ల ఎముకలు బలంగా మారుతాయి నోటు దుర్వాసనతో బాధపడేవారు బచ్చలకూరని ఉడకబెట్టి తిన్నా లేదా పచ్చిగా నమ్మిన కూడా సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ ఆకుపచ్చని కాయగూరలు తినటం వల్ల బరువు కూడా త్వరగా తగ్గటం జరుగుతుంది.