దగ్గు ఎందుకు వస్తుంది? ఎప్పుడు హాస్పటల్ కు వెళ్లాలి?
దగ్గు రావడం చాలా సహజం. అయితే కొన్ని లక్షణాలతో దగ్గు వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇది ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు సంకేతం కావొచ్చు.
కాలాలు మారుతున్నప్పుడు దగ్గు, జలుబు వంటి సమస్యలు రావడం చాలా సహజం. దగ్గు కొన్ని రోజుల్లోనే దానంతట అది తగ్గిపోతుంది. అయినప్పటికీ కొన్ని కొన్ని సార్లు మాత్రం ఈ దగ్గు కొన్ని వారాల పాటు ఉంటుంది. ఈ దగ్గు గొంతు వాపు, చికాకు, సంక్రమణకు కారణమవుతుంది.
దగ్గు ఎందుకు వస్తుంది?
మనం దగ్గినప్పుడు మన ఊపిరితిత్తులు ఎంతో వేగంగా గాలిని విడుదల చేస్తాయి. కొన్నిసార్లు ఈ వేగం గంటకు 100 మైళ్లకు మించి ఉంటుందట. దీంతో వాయు మార్గంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. నిజానికి దగ్గు రావడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. వీటిలో కొన్ని చాలా ప్రమాదకరమైనవి. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా హాస్పటల్ కు వెళ్లాలి.
దగ్గు, గొంతునొప్పి
దగ్గు ఒక సాధారణ సమస్య. దీనికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా సార్లు దగ్గు దానంతట అదే తగ్గిపోతుంది. కానీ కొన్నిసార్లు చికిత్స అవసరం కావొచ్చు. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు దగ్గు అస్సలు తగ్గదు. దీనికి దీర్ఘకాలిక సమస్యే కారణం కావొచ్చు. గొంతునొప్పి, శ్లేష్మం వివిధ రంగుల్లో ఉండటం, ఛాతీ నొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు కలిగితే మాత్రం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హాస్పటల్ కు వెళ్లండి.
నోటి నుంచి రక్తం రావడం
దగ్గుతున్నప్పుడు నోట్లో నుంచి రక్తం రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వీటిలో ఊపిరితిత్తుల క్యాన్సర్, ఉబ్బసం, బ్రోన్కైటిస్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, బ్రోన్కైటిస్ ఉన్నాయి. అసలు కారణం తెలియాలంటే హాస్పటల్ కు వెళ్లి టెస్టులు చేయించుకోవాలి.
cough
శ్లేష్మం రంగు
శ్వాసనాళంలోని కణాలు శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తాయి. మీ శ్లేష్మం రంగు పసుపు, ఆకుపచ్చ లేదా గోధుమ రంగులో ఉంటే.. అది తెల్ల రక్త కణాలను కలిగి ఉందని అర్థం. ఈ కణాలు సంక్రమణతో పోరాడతాయి. మీకు ఒక వారం కంటే ఎక్కువ రోజులు ఈ రకమైన దగ్గులో శ్లేష్మం ఉంటే.. ఇది న్యుమోనియాకు సంకేతం కావొచ్చు. దీనితో పాటుగా పింక్ లేదా ఎరుపు రంగు శ్లేష్మం గుండె ఆగిపోవడం లేదా పల్మనరీ ఎడెమాను సూచిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
శ్వాస సమస్య
దగ్గుతో పాటుగా గొంతులో గరగర లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే.. అది యాసిడ్ రిఫ్లక్స్, ఉబ్బసం లేదా అలెర్జీకి సంకేతం కావొచ్చు. ఇలాంటి పరిస్థితిలో మీరు వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. దీంతో సంక్రమణ వ్యాపించొచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, గొంతు ఆగిపోయిన అనుభూతి కలిగితే లేట్ చెయ్యకుండా హాస్పటల్ కు వెళ్లండి.
2 వారాల కంటే ఎక్కువ దగ్గు ఉంటే
2 నుంచి 4 వారాల పాటు దగ్గు ఉన్నట్టైతే మీరు వెంటనే హాస్పటల్ కు వెళ్లాలి. ఎందుకంటే ఇది ప్రమాదకరమైన రోగానికి సంకేతం కావొచ్చు.