జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యల వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. అయితే కొన్ని ఆహార పదార్థాలతో కూడా ఈ సమస్యలను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.

ప్రస్తుత కాలంలో చాలా మంది జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. ఆహారం సరిగా జీర్ణం కాకపోతే కడుపునొప్పి, వాంతులతో సహా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. జీర్ణక్రియ జరగనప్పుడు కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రైటిస్, ఎసిడిటీ, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలు జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి. అవేంటంటే..
జీలకర్ర నీరు
కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు ఎదురైతే జీలకర్రను రోజూ నీటిలో మరిగించి తాగుతూ ఉండండి. ఎందుకంటే ఈ జీలకర్రలో జీర్ణక్రియను ప్రోత్సహించే ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి.
అల్లం టీ
జీర్ణ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజూ అల్లంతో టీ ని తాగొచ్చు. లేదా అల్లంను మీరు తినే ఆహారంలో చేర్చుకోవచ్చు. ప్రతిరోజూ ఒక గ్లాసు అల్లం నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి.
పెరుగు
పెరుగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మన గట్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఎన్నో జీర్ణ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ మధ్యాహ్న భోజనంతో పాటు లేదా లేకుండా కొంచెం పెరుగు తినడం అలవాటు చేసుకుంటే జీర్ణ సమస్యలు పోతాయి.
నిమ్మరసం
ప్రతిరోజూ ఒక గ్లాసు నిమ్మరసం తాగడం వల్ల జీర్ణ సమస్యలు దూరం కావడమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంతేకాదు చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. నిమ్మకాయ నీటిలో కొద్దిగా అల్లం కలుపుకుని తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
black pepper
నల్లమిరియాలు
నల్ల మిరియాల్లో ఉండే మెంతోల్ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ఇది వాంతులు, గుండెల్లో మంటతో పోరాడటానికి కూడా సహాయపడుతుంది. నల్లమిరియాలు మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జీవక్రియను మెరుగుపరుస్తాయి.