చలికాలంలో చన్నీటి స్నానం చేస్తే స్ట్రోక్ వస్తుందా?
చలికాలంలో చాలా మంది వేడినీళ్లతోనే స్నానం చేస్తుంటారు. అయితే కొంతమంది మాత్రం వణికించే చలిలో కూడా చల్ల నీళ్లతోనే స్నానం చేస్తుంటారు. కానీ దీనివల్ల డేంజర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
bath
చలికాలం వచ్చిందంటే చాలు చాలా మంది స్నానం చేయడానికే ఇష్టపడరు. అయితే కొంతమంది మాత్రం వేడినీళ్లతోనే చేస్తారు. ఇంకొంత మంది చల్లనీళ్లతోనే స్నానం చేసేస్తుంటారు. కానీ చలికాలంలో గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కానీ చలికాలంలో చన్నీటి స్నానాలు వృద్ధులకు హానికరమన్న సంగతి మీకు తెలుసా?
bath
చలికాలంలో చల్లని నీటిని తలపై పోస్తే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. చల్లటి నీటిని తలపై పోయడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయి. అలాగే రక్తపోటు అకస్మాత్తుగా పెరుగుతుంది. అంతేకాదు మెదడు ఉష్ణోగ్రతను నియంత్రించే ఆడ్రినలిన్ హార్మోన్ వేగంగా విడుదలవుతుంది. దీనివల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
bath
మన వయసు పెరిగే కొద్దీ మెదడు కణాలు కూడా బలహీనపడుతుంటాయి. ఇలాంటి పరిస్థితిలో.. రక్తపోటు పెరిగితే, ధమనులలో రక్తం గడ్డకట్టడం, మస్తిష్క నరాల క్షీణత, రక్తస్రావం జరుగుతుంది. ఇదే జరిగితే ఒక్కోసారి మరణం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలతో బాధపడేవారు ఈ సీజన్ లో బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 60 ఏండ్లు పైబడిన వారు ఈ సీజన్ లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించడానికి.. చల్లటి నీటికి బదులుగా గోరువెచ్చని నీటితోనే స్నానం చేయండి. అలాగే ముందుగా పాదాలను నీటితో తడిపి ఆ తర్వాత చేతులను తడిపై శరీరంపై నీటిని పోసుకోవాలి.
చలికాలంలో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పును నివారించడానికి క్రమం తప్పకుండా యోగా చేయాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే సీజనల్ గా దొరికే పండ్లను, కూరగాయలు ఎక్కువగా తినాలి. ప్రాసెస్ చేసిన, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం మానుకోవాలి. అలాగే శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి ఉన్ని దుస్తులను ధరించాలి.