MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • ఎండాకాలంలో ఈ మసాలా దినుసులను తింటే..!

ఎండాకాలంలో ఈ మసాలా దినుసులను తింటే..!

ఎండాకాలంలో పండ్లను ఎక్కువగా తింటారు. మసాలా దినుసులను చాలా వరకు తగ్గిస్తారు. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సీజన్ లో కూడా కొన్ని మసాలా దినుసులను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే? 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 26 2023, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వాతావరణాన్ని బట్టి మన ఆహారాన్ని మార్చుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే  కొన్ని రకాల ఆహారాలు శరీరంలో వేడిని పెంచుతాయి. ఎండాకాలంలో పండ్లను, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఇతర ఆహారాలను ఎక్కువగా తినాలంటరు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇవి శరీర వేడిని తగ్గిస్తాయి. అయితే ఎండాకాలంలో చాలా మంది మసాలా దినుసులకు దూరంగా ఉంటారు. ఎందుకంటే ఇవి శరీరంలో వేడిని పెంచుతాయని. వేసవిలో మసాలా దినుసులను ఆహారంలో చేర్చుకోవడం కూడా మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఎందుకంటే వీటిలో ఎన్నో రోగాలను నయం చేసే గుణాలు ఉన్నాయి. అవేంటంటే.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

జీలకర్ర

జీలకర్ర గింజల్లో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. కాచి చల్లార్చిన జీలకర్ర నీటిని తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. దాహం తీర్చడానికి ఈ జీరా వాటర్ బాగా ఉపయోగపడుతుంది. ఈ వాటర్ మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. జీలకర్ర వాటర్ డీహైడ్రేషన్ ను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. శరీరంలో తగినంత నీరు లేకపోతే డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. దీనిని జీలకర్ర నీటితో తగ్గించుకోవచ్చు. అందుకే ఎండాకాలంలో ఈ నీటిని క్రమం తప్పకుండా తాగడం మంచిది. బరువు తగ్గాలనుకునేవారికి జీలకర్ర కూడా సహాయపడుతుంది. జీలకర్రలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్స్ శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది.
 

36
coriander

coriander

కొత్తిమీర

కొత్తిమీరను ఎక్కువగా గార్నిషీ కోసం ఉపయోగిస్తారు. కొత్తిమీర రుచికే కాదు దీనిలో ఎన్నో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు కూడా ఉంటాయి. కొత్తిమీరలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని చల్లబరచడానికి సహాయపడతాయి. కొత్తిమీరలో ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, డైటరీ ఫైబర్స్, విటమిన్ ఎ, విటమిన్ సి , విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. కొత్తిమీర కూడా జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

46
<p>mint leaves</p>

<p>mint leaves</p>

పుదీనా ఆకులు

పుదీనా ఆకుల్లో కూడా ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఎండాకాలంలో పుదీనా వాటర్ ను తాగితే శరీరం చల్లగా ఉంటుంది. ఈ ఆకులు జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. ఇవి చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.

56
Image: Getty Images

Image: Getty Images

యాలకులు

యాలకులు సుగంధ ద్రవ్యాల రాణిగా ప్రసిద్ధి చెందాయి. యాలకుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి మీ జీవక్రియను పెంచుతాయి. దీంతో శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. ఇవి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. యాలకుల్లో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు విటమిన్ బి 6, విటమిన్ బి 3, విటమిన్ సి, జింక్, కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. 
 

66

ఎండాకాలంలో ఈ మసాలా దినుసులను తినకండి

ఎండుమిర్చి, వెల్లుల్లి, అల్లం, నల్ల మిరియాలను ఎండాకాలంలో అస్సలు తినకండి. ఎందుకంటే ఇవి శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. అందుకే వీలైనంత వరకు తగ్గించాలి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Hypnic Jerk: నిద్రలో సడెన్ గా జారిపడ్డట్టు అనిపిస్తుందా? ఉలిక్కిపడి లేస్తున్నారా? ఏందుకిలా జరుగుతుంది?
Recommended image2
Cancer Risk Habits: మీరు రోజు చేసే ఈ 5 తప్పులే క్యాన్సర్‌కు కారణం.. వెంటనే మారకపోతే డేంజరే !
Recommended image3
Mutton Health Risks: మీరు తినే మటన్‌లో ఈ పార్ట్స్ ఉన్నాయా? అయితే మీ హెల్త్ రిస్క్‌లో పడినట్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved