నిద్ర మాత్రలు వాడుతున్నారా? అయితే ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే..!
ప్రస్తుతం చాలా మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. ఇంకేముంది దీంతో నిద్ర మాత్రల వాడకం బాగా పెరిగిపోయింది. కానీ నిద్రమాత్రలు ఎన్నో సమస్యలకు దారితీస్తాయి తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
చెడు జీవనశైలి, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు నిద్రలేమికి దారితీస్తాయి. అందుకే చాలా మంది నిద్రపోవడానికి నిద్ర మాత్రలను ఉపయోగిస్తుంటారు. అయినా ప్రస్తుతం నిద్రమాత్రల గిరాకీ బాగా పెరిగిపోతోంది. అయితే డాక్టర్లు సిఫారసు చేసిన మాత్రలు పెద్దగా హాని కలిగించవు. కానీ ఎవరైనా దీనికి బానిసైతే మాత్రం వీటిని వేసుకోకుండా అస్సలు నిద్రపోనేపోరు. కానీ నిద్రమాత్రలు మన ఆరోగ్యాన్ని ఎంతో దెబ్బతీస్తాయి. ముఖ్యంగా ఇది మీ నిద్ర నాణ్యతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
వ్యసనంగా మారొచ్చు
నిద్ర మాత్రలను ఎక్కువగా వాడితే మీరు వాటికి బాగా అలవాటు పడే అవకాశం ఉంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకునే వారు సులభంగా వ్యసనపరులుగా మారుతారని నిపుణులు అంటున్నారు. ఇలాంటి వారే నిద్రపోవడానికి వీటిని ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఆరోగ్యంగా ఉండాలంటే వీటికి దూరంగా ఉండటమే మంచిదంటున్నారు నిపుణులు. వీటివల్ల మీరు ఈ మాత్రలను వేసుకోకుండా అస్సలు నిద్రపోలేరు.
sleeping pills
నిద్ర నాణ్యతపై ప్రభావం
నిపుణులు ప్రకారం.. నిద్ర మాత్రలు త్వరగా నిద్రపోవడానికి సహాయపడతాయి. కానీ ఇది నిద్ర నాణ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అంటే నిద్రమాత్రలు వేసుకునే వారు సాధారణ వ్యక్తుల కంటే ఎక్కువగా నిద్రపోయినప్పటికీ.. వారి శరీరం, మెదడు పూర్తిగా రిలాక్స్ అవ్వవు. దీని వల్ల వారు నిద్ర లేచిన తర్వాత రిఫ్రెష్ గా, ఎనర్జిటిక్ గా ఉండరు.
నిద్రమాత్రలు తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు
క్రమం తప్పకుండా నిద్రమాత్రలు తీసుకోవడం వల్ల మైకము, నిద్ర లేమి, తలనొప్పి, నోరు పొడిబారడం, అనేక జీర్ణ సమస్యలు వస్తాయి. నిద్ర మాత్రలు తీసుకోవడం వల్ల పగటిపూట నిద్ర వస్తుంది.
కాలక్రమేణా వాటి మోతాదు పెరుగుతుంది
మొదట్లో కొద్ది డోసులో నిద్రమాత్రలను వేసుకున్నా తొందరగా నిద్రపడుతుంది. అయితే మీ శరీరం వీటికి బానిస అయితే వీటి మోతాదును పెంచేదాక మీకు నిద్రపట్టదు. ఇది ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. శరీరం దీనికి అలవాటు పడిన తర్వాత ఏదో ఒక సమయంలో నిద్రమాత్రల మోతాదును పెంచాల్సి ఉంటుంది. నిద్రమాత్రల వల్ల కలిగే ఇతర సమస్యలేంటంటే..
Excessive Sleep
ఒత్తిడి, ఆందోళన ప్రమాదాన్ని పెంచుతుంది
నిద్రమాత్రలు తీసుకోవడం నిద్ర నాణ్యతపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీని వల్ల నిద్రలేమి సమస్య ఉంది. ఇది ఒత్తిడిని కలిగిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా వృద్ధుల్లో.. దీని వల్ల కింద పడటం, గాయాలయ్యే ప్రమాదం ఉంది.
allergy
అలెర్జీ
కొంతమందిలో నిద్ర మాత్రలు తీసుకోవడం వల్ల అలెర్జీ అయ్యే అవకాశం ఉంది. నిద్రమాత్రలను తీసుకుంటే దురద, దద్దుర్లుతో పాటు ఇతర రకాల అలెర్జీలు కూడా రావొచ్చు.
జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది
నిద్రమాత్రలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీనివల్ల మలబద్ధకం, అజీర్థి, విరేచనాలు, వాంతులు వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.