MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Health
  • గర్భస్రావం అయ్యిందా? తొందరగా కోలుకోవాలంటే వీటిని తినండి

గర్భస్రావం అయ్యిందా? తొందరగా కోలుకోవాలంటే వీటిని తినండి

తల్లి కావడమనేది స్త్రీల జీవితంలో ఎంతో ముఖ్యమైన దశ. మధురమైన అనుభూతి. అయితే కొన్ని కారణాల వల్ల కొంతమంది మహిళలు గర్భస్రావాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది శారీరకంగా, మానసికంగా ఎంతో బాధను కలిగిస్తుంది.  ఇలాంటి పరిస్థితిలో గర్భస్రావం తర్వాత త్వరగా కోలుకోవడానికి  కొన్ని ఆహారాలను తినాలి. అలాగే మరికొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అవేంటంటే.. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 24 2023, 11:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గర్భస్రావం తర్వాత శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా గర్భస్రావం తర్వాత ఆడవారు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో  సుమారుగా రెండు వారాల పాటు కడుపు తిమ్మిరి, బలహీనత, నొప్పి, అధిక రక్తస్రావం వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. ఈ శారీరక సమస్యలు తగ్గడానికి కొంత సమయం పడుతుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

గర్భస్రావం తర్వాత వచ్చే సమస్యలను తగ్గించడానికి ఆరోగ్యకరమైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. గర్భస్రావం అయినవారు పోషకాలను పుష్కలంగా తీసుకోవాలి. అలాగే కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. గర్భస్రావం అయిన వారు ఎలాంటి ఆహారాలను తినాలి? ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

36
Protein foods

Protein foods

గర్భస్రావం తర్వాత వీటిని తినండి

ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం

గర్భస్రావం తర్వాత తగినంత ప్రోటీన్ ఉన్న ఆహారాలను ఖచ్చితంగా తినండి. ఇవి మీ కండరాలను నిర్మించడానికి సహాయపడతాయి. ఇది గర్భస్రావం తర్వాత మీ శరీరం వేగంగా కోలుకోవడానికి ప్రోటీన్ ఫుడ్ ఎంతో సహాయపడుతుంది.

46

ద్రవ ఆహారం 

గర్భస్రావం తర్వాత ద్రవాలను పుష్కలంగా తీసుకోవాలి. దీనివల్ల మీ శరీరంలో రక్త నష్టం జరగదు. గర్భస్రావం నుంచి త్వరగా కోలుకోవడానికి డిటాక్స్ డ్రింక్స్, కొబ్బరి నీళ్లు, దానిమ్మ జ్యూస్ ను రెగ్యలర్ గా తాగండి. 
 

56
calcium

calcium

కాల్షియం ఉండే ఆహారం 

గర్భిణీ స్త్రీ శరీరంలో కాల్షియం లోపం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే గర్భస్రావం తర్వాత మీ రోజువారీ ఆహారంలో కాల్షియం పుష్కలంగా ఉండే ఆహారాన్ని చేర్చండి.
 

66


వీటికి దూరంగా ఉండండి

గర్భస్రావం తర్వాత కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా షుగర్ ఫుడ్స్, జంక్ ఫుడ్ ను అస్సలు తినకండి. గర్భస్రావం తర్వాత మీరు ఎక్కువ తీపి తింటే మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

గర్భస్రావం అయిన వెంటనే ఆల్కహాల్ ను తాగకూడదు. ఎందుకంటే ఆల్కహాల్ ను తాగడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. 

జంక్ ఫుడ్ ను తినడం అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా గర్భస్రావం తర్వాత తినడం మంచిది కాదు. బర్గర్లు, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ఆహార పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి.

 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved