ప్రోటీన్ ఫుడ్ ను ఎక్కువ తింటే మూత్రపిండాలు దెబ్బతింటయ్.. ఇది నిజమేనా?
ప్రోటీన్ల లోపం వల్ల మనకు ఎన్నో జబ్బులొస్తాయి. అందుకే ప్రోటీన్ ఫుడ్ ను ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెబుతుంటారు. అయితే దీనివల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయని కొందరు అంటుంటారు. మరి దీనిలో నిజమెంతుందంటే?

ప్రోటీన్లు మన శరీరానికి చాలా చాలా అవసరం. ఎందుకంటే ఇవే మనల్ని ఎన్నో రోగాల ముప్పు నుంచి తప్పిస్తాయి. పాల ఉత్పత్తులు, మాంసాలు, గుడ్లు, కాయధాన్యాలు, కూరగాయల్లో ప్రోటీన్లు ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో ఏదో ఒక రూపంలో ప్రోటీన్లను తీసుకుంటారు. అయితే ప్రోటీన్లను ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మూత్ర పిండాలు దెబ్బతింటాయని కొంతమంది అంటూ ఉంటారు. మరి దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే?
protein
అధిక ప్రోటీన్ ఆహారం మీ మూత్రపిండాలను దెబ్బతీయదు
ప్రోటీన్ ఫుడ్ మీ మూత్రపిండాల ఆరోగ్యంపై నిరూపితమైన ప్రభావాన్ని ఏం చూపదు. మితమైన మొత్తంలో ప్రోటీన్ ఫుడ్ ను తిన్నా మూత్రపిండాలు దెబ్బతింటాయని కొంతమంది అంటుంటారు. కానీ దీనిలో ఏ మాత్రం నిజం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది మీ ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని నిపుణులు చెబుతున్నారు.
మానవ శరీరంలో ప్రోటీన్ ఒక ముఖ్యమైన భాగం. ఇది మన శరీర నిర్మాణానికి బిల్డింగ్ బ్లాక్ వంటిది. అలాగే హార్మోన్లు, ఎంజైమ్లు, కణజాలాలు, గోళ్లు పెరిగేందుకు, జుట్టు పెరుగుదలకు, ఎముకల ఆరోగ్యానికి మొదలైన ప్రతిదాన్ని తయారు చేయడానికి ఇది చాలా అవసరం. మన శరీరానికి ప్రోటీన్లు చాలా అవసరం. ఏదేమైన ప్రోటీన్ ఫుడ్ ను అతిగా తినడం మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు.
protein
ప్రోటీన్ ఫుడ్ ను ఎక్కువగా తినడం వల్ల ప్రోటీన్ జీర్ణ సమస్యలు వస్తాయి. కానీ మూత్రపిండాలు దెబ్బతినవు. కాబట్టి ఎక్కువ ప్రోటీన్ గురించి ఆందోళన చెందడం మానేయండి. జీర్ణ సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రోటీన్ ను తక్కువ తీసుకుంటే సరిపోతుంది.
<p>protein</p>
మార్చి 2000 లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ అండ్ ఎక్సర్సైజ్ మెటబాలిజంలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. బాడీ బిల్డర్లు, అథ్లెట్లు ప్రోటీన్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకుంటారు.వీరిపై జరిపిన అధ్యయనంలో ప్రోటీన్ ఫుడ్ మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేయదని తేలింది.
మూత్రపిండాలను ప్రోటీన్ ఫుడ్ దెబ్బతీయదు. కానీ మూత్రపిండాలలో ఇన్సులిన్, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడం వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడం వల్ల కేశనాళికలకు నష్టం కలుగుతుంది. శుద్ధి చేసిన చెక్కెర, కార్భోహైడ్రేట్లు ఇన్సులిన్, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతాయి. మీ మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ ఫుడ్ ను ను కాకుండా చక్కెర, శుద్ది చేసిన కార్భోహైడ్రేట్లను తీసుకోవడం తగ్గించండి.